విభజనకు ఎంఐఎం వ్యతిరేకం
posted on Nov 12, 2013 @ 2:08PM
రాష్ట్రాన్ని విభజిస్తే 'రాయల తెలంగాణ' ఏర్పాటు చేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ఈరోజు జీవోఎంతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ విభజన జరిగితే హైదరాబాద్‌పై కేంద్రం పెత్తనాన్ని ఒప్పుకోమన్నారు. హైదరాబాద్ శాంతిభద్రతలు కేంద్రం చేతిలో ఉండొద్దని తెలిపారు. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకమని అసదుద్దీన్ మరోసారి స్పష్టం చేశారు. విభజన తప్పనిసరైతే హైకోర్టును విభజించాలని డిమాండ్ చేశారు.
ఈ మధ్య కాలంలో ఎం.ఐ.ఎం. తన రాయల తెలంగాణ నినాదంలో మార్పులు, చేర్పులు కూడా చేసింది. రాయల తెలంగాణ అంటే మొత్తం తెలంగాణ జిల్లాలు, నాలుగు రాయలసీమ జిల్లాలతో ఏర్పడేది కాదట. పది తెలంగాణ జిల్లాలు ప్లస్ రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలతో ఏర్పడిన రాయల తెలంగాణ ఏర్పడితేనే ఎం.ఐ.ఎం. ఒప్పుకుంటుందట. రాయలసీమలోని రెండు జిల్లాల మీద ప్రేమ ఎందుకో, మిగతా రెండు జిల్లాలు చేసిన పాపమేమిటో ఎం.ఐ.ఎం. నాయకులకు తప్ప ఎవరికీ అర్థంకాని విషయం.