ఆగిన మెట్రో సేవలు
posted on Oct 13, 2018 @ 12:14PM
హైదరాబాద్ మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది.మియాపూర్ నుంచి అమీర్‌పేట వెళ్తున్న మెట్రో రైలు సాంకేతిక కారణాలతో కూకట్‌పల్లి బాలానగర్ మెట్రోస్టేషన్‌లో నిలిచిపోయింది.రైలు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగటంతో నిలిపోయినట్లు సిబ్బంది చెబుతున్నారు.అర్థాంతరంగా ట్రైను నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర అసహనానికి గురయ్యారు.మెట్రో అధికారులపై మండిపడ్డారు.రైలు నిలిచిపోవడంతో ఆ మార్గంలో ఇతర రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.దీంతో ప్రయాణికులు మెట్రోస్టేషన్లలో పడిగాపులు కాస్తున్నారు.మెట్రోస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. మరమ్మతు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.మరమ్మతులు పూర్తయ్యేవరకూ మియాపూర్ నుంచి బాలానగర్ వరకూ మెట్రోరైలు సేవలను అధికారులు నిలిపివేశారు. ఎర్రగడ్డ నుంచి అమీర్‌పేట వరకూ రైళ్లు నడవనున్నట్లు తెలిపారు.