సుప్రీంలో మీడియా రూం... నెలకోసారి ప్రధాన న్యాయమూర్తితో ఇంటరాక్షన్
posted on Mar 21, 2024 @ 2:39PM
సమాజంలో నాలుగో స్థంభం మీడియా. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే నాలుగో స్థంభం ఆవశ్యకతను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గుర్తించింది. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచే మీడియాకు అత్యున్నత న్యాయస్థానం అత్యున్నత గౌరవం ఇచ్చింది. ఈ మేరకు పాలకులకు ఆదేశాలు జారి చేసింది. ప్రజాస్వామ్య పునరుద్దరణకు న్యాయవ్యవస్థ మునుపెన్నడూ లేని విధంగా ఆదేశాలు ఇవ్వడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టులో మీడియా కోసం ఇప్పటివరకు ప్రత్యేక గది లేదు. ఈ సమస్యను గుర్తించిన ప్రధాన న్యాయమూర్తి మీడియాకు ప్రత్యేక గది కేటాయించారు. భావప్రకటన స్వేచ్చకు పెద్ద పీట కల్పించే విధంగా మీడియా ప్రతినిధులకు 30 రోజుల కోసారి చర్చా గోష్టి నిర్వహించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నేరుగా ప్రధాన న్యాయమూర్తి ఈ చర్చా గోష్టిలో పాల్గొంటారు. మొత్తానికి స్వాతంత్య్రం సిద్దించిన ఏడు దశాబ్దాల చరిత్రలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రజాస్వామిక వాదులు స్వాగతించారు