మే14న షర్మిల పార్టీ జెండా.. ఎజెండా..
posted on Feb 15, 2021 @ 1:06PM
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్న విషయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిందే. పార్టీ ఆవిష్కరణకు షర్మిల రెండు తేదీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మే 14న .. లేదా జూలై 8న ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.
మే 14 కు ఒక సెంటిమెంట్ ఉంది.. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మే 14నే..
అందుకే ఆ రోజును షర్మిల సెంటిమెంట్ గా భావిస్తున్నారని.. మే 14న పార్టీ జెండా అజెండా ప్రారంభిస్తే పచ్చ జెండా ఊపి పాదయాత్ర లకు వెల్లొచ్చని ముఖ్య నేతలు షర్మిలకు సూచించినట్లు సమాచారం. జులై 8న కూడా షర్మిల ఆలోచిస్తున్నారని ఆరోజు రాజశేఖర్ రెడ్డి జయంతి కావడం వాళ్ళ అదే రోజు పార్టీ జెండా, ఎజెండా విడుదలకు ముహూర్తం గా షర్మిల అనుకుంటుంటారని. అయితే జూలై 8 నాటికి ఆలస్యం అవుతుందని ముఖ్యనేతలు చెబుతున్నట్లు తెలియవచ్చింది. కాగా రెండు తేదీల్లో ఒకదానిని ఫైనల్ చేసే ఆలోచనలో షర్మిల ఉన్నట్లు సమాచారం. చూడాలి వైఎస్ ప్రమాణ స్వీకారం రోజునా లేక వైఎస్ జయంతి రోజునా షర్మిల పార్టీ జెండా, ఎజెండా..