కెనడియన్ జానపద సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చిన హెలెన్
posted on Sep 5, 2020 @ 5:34PM
మేరీ హెలెన్ క్రైటన్ (5 సెప్టెంబర్ 1899 - 12 డిసెంబర్ 1989)
గ్రామీణ ప్రాంతాలప్రజల రోజువారి జీవితాల నుంచి వచ్చే పాటలు, ఆటలు కాలక్రమేణా మరుగున పడిపోతాయి. వాటిని సేకరించి భవిష్యత్ తరాలవారి కోసం భద్రపరచాలన్న ఆలోచనతో తన జీవితాన్ని జానపదం కోసం అంకితం చేశారు మేరీ హెలెన్ క్రైటన్. కెనడాకు చెందిన ప్రముఖ జానపద రచయిత. ఆమె కృషి వల్లే ఈనాడు కెనడాలో జనపద సాహిత్యం వెలుగులోకి వచ్చింది.
నోవా స్టోటియాలో 5 సెప్టెంబర్ 1899 లో జన్మించిన హెలెన్ పల్లెపాటలు వింటూ పెరిగారు. దాంతో ఆమెకు తెలియకుండానే జానపదసాహిత్యంపై మక్కువ పెరిగింది. హాలిఫాక్స్ లేడీస్ కాలేజీ చదువుకున్న ఆమె మెక్గిల్ విశ్వవిద్యాలయంలో సంగీతం డిప్లొమా పూర్తి చేశారు.టొరొంటోలోని రాయన్ ప్లైయింగ్ కార్పోస్ లో చేరారు. కింగ్స్ కాలేజీ యూనివర్సిటీ లో ఆమె డీన్ గా పనిచేశారు. జన బాహుళ్యంలో ప్రాచుర్యంలో ఉన్న పాటలను, కథలను హెలెన్ సేకరించేవారు. అలా దాదాపు ఆమె నాలువేల సాంద్రాయ పాటలను, కథలను సేకరించారు. వాటన్నింటినీ అక్షరీకరిస్తూ అనేక పుస్తకాలు ప్రచురించారు. లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ అందించిన ఫెలోషిప్ తో రికార్డర్ కొని ఆమె జానపద పాటలను, రికార్డు చేసేవారు. కెనడియన్ మ్యూజియం ఆఫ్ సివిలైజేషన్ కోసం పాటలను కంపోజ్ చేసి రికార్డింగ్ చేశారు. కేవలం కెనడియన్ జానపదసాహిత్యామే కాకుండా గాలీ, జర్మన్, మిక్ మక్, ఆఫ్రికన్ ప్రజల ఆచారాలను సేకరించారు. ఇందుకోసం ఆమె మారుమూల ప్రాంతాల్లోకి కాలినడకన వెళ్లేవారు. అలా ఆమె సేకరించిన జానపదసాహిత్యంలోని పాటలు, కథలు అక్కడి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
దశాబ్దాల పాటు చేసిన పరిశోధనల ఫలితంగా వెలుగులోకి వచ్చిన పాటలు, కథలే కాదు ప్రజల ఆచారాలు, మూఢనమ్మకాలను హెలెన్ పుస్తకాలుగా తీసుకువచ్చారు. జానపదసాహిత్యంలో ఆమె చేసిన కృషికి అనేక గౌరవ డిగ్రీలు అందుకున్నారు. 1976లో ఆర్డర్ ఆఫ్ కెనడాలో సభ్యురాలిగా పనిచేశారు. 12 డిసెంబర్ 1989లో ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఇల్లు, ఎవర్‌గ్రీన్ హౌస్, డార్ట్మౌత్ హెరిటేజ్ మ్యూజియంలో ఒక భాగంగా ప్రజలకు అందుబాటులో ఉంది. ది ఫ్రాంక్ డేవిస్ లెగసీ అవార్డును అందుకున్న హెలెన్ ను 2018లో జాతీయ చారిత్రక వ్యక్తిగా కెనడా గుర్తించింది.