మార్క్ జుకెర్ బర్గ్ కే డొమైన్ అమ్మిన కొచ్చి స్టూడెంట్..
posted on Apr 16, 2016 @ 4:10PM
సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలోనే ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు ఎవరంటే మార్క్ జుకర్‌బర్గ్ అని తెలయని వారుండరు. ఫేస్ బుక్ తో సోషల్ మీడియా రంగంలోనే విప్లవాన్ని తీసుకొచ్చాడు. అలాంచి జుకెర్ బర్గ్ కే డొమైన్ అమ్మాడు ఏ కొచ్చి కుర్రాడు. వివరాల ప్రకారం.. అమల్ ఆగస్టిన్ అనే కుర్రాడు ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాడు. అతనికి డొమైన్ పేర్లను సొంతం చేసుకోవడం హాబీ. ఈ నేపథ్యంలోనే అమల్ నాలుగు నెలల క్రితం 'మాక్స్‌చాన్‌జుకర్‌బర్గ్.ఓఆర్‌జీ' పేరిట ఓ వెబ్‌సైట్ డొమైన్ ను రిజిస్టర్ చేయించుకున్నాడు. ఈ డొమైన్ లో జుకెర్ బర్గ్ కూతురి పేరు ఉండటంతో ఈ డొమైన్ హక్కులు కొనుగోలు చేసేందుకు ఫేస్‌బుక్ ముందుకొచ్చింది. అమల్‌తో బేరసారాలు ఆడి.. 700 డాలర్ల (రూ. 46వేల)కు ఈ వెబ్‌సైట్‌ను సొంతం చేసుకుంది. దీనికి అమల్ ఈ డొమైన్ అమ్మినందుకు ఎంత డబ్బు వచ్చిందన్నది ముఖ్యం కాదు.. ఫేస్ బుక్ లాంటి కంపెనీ తనను ఆశ్రయించి బేరసారాలు జరిపిందని ఇదే తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపాడు.