జగన్ రెడ్డి జిల్లాలో కాల్పులు..
posted on Jun 15, 2021 @ 9:42AM
కడప జిల్లా పులివెందుల అక్కడ ప్రాణాలు తీయడం చాలా ఈజీ.. హైద్రాబాద్ లో మనం ఓ కాక హోటల్ కి వెళ్లి దోష తిన్నంత ఈజీ వాళ్లకు.. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లా. ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. తన నియోజగవర్గంలో అలా జరగడం అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. అక్కడ ఎవరినైనా టార్గెట్ చేస్తే ప్రభుత్వం ప్రధకాలు ప్రవేశ పెట్టినట్లు విడతల వారీగా డోసు పెంచుతూపోతారు.. అప్పటికి వినకపోతే కథం చేస్తారు.. కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న కడప పులివెందులలో ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. ఆ కాల్పులు స్థానికుల్లో కలకలం రేపాయి. ఆస్తి తగాదాలతో ఇద్దరు ప్రత్యర్ధులు ఒకరిపై ఒకరు హత్యాయత్నానికి పాల్పడ్డారు..మరి చివరికి ఏం జరిగిందో తెలుసుకుందామా..?
పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె గ్రామంలో శివప్రసాద్‌రెడ్డి అనే వ్యక్తి తన ప్రత్యర్థి పార్థసారధిరెడ్డి అనే వ్యక్తికి కొంతకాలంగా రెండు కుటుంబాల మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శివప్రసాద్‌రెడ్డిని హత్య చేసేందుకు పార్థసారథిరెడ్డి తన కుమారులతో కలిసి ప్రయత్నించాడు. ప్రత్యర్థుల మూవ్మెంట్ ని పసిగట్టిన శివప్రసాద్‌రెడ్డి కొంతకాలంగా అప్రమత్తంగా ఉన్నాడు. తన లైసెన్డ్స్ గన్‌తో పార్థసారథిని కాల్చి చంపి ఆ తరువాత జరిగే పరిణామాలు గుర్తుచేసుకుని భయాందోళనకు గురైన అదే గన్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు పరిశీలించారు. ఈ ఘటనకు ఆస్తి తగాదాలే కారణమని స్థానికులు చెబుతున్నా.. వేరే కారణమేదైనా ఉందా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.