మధు యాష్కి సరికొత్త ఏడుపు
posted on May 17, 2014 @ 6:07PM
సీమాంధ్రులను తిట్టిపోయడంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ మధు యాష్కి అందరికంటే ముందుండేవాడు. రాహుల్ గాంధీకి ఫ్రెండ్ అయిన మధు యాష్కి రాహుల్‌కి తప్పుడు నివేదికలు, లేనిపోని ఆశలు కల్పించి, తెలంగాణ ఇస్తే ఎంపీ సీట్లన్నీ మనవేనని సీన్ క్రియేట్ చేసి మొత్తానికి తెలంగాణ వచ్చేలా చేశాడు. చివరికి ఏమయింది.
తెలంగాణ కోసం ఎంతో పాటు పడ్డానని బిల్డప్ ఇచ్చుకునే మధు యాష్కి కూడా నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో కేసీఆర్ కూతురు కవిత చేతిలో దారుణంగా ఓడిపోయాడు. ఊహించని విధంగా ఓడిపోవడంతో మధు యాష్కికి మైండు ఖరాబైందేమోనన్న సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఎన్నికలలో దారుణంగా ఓడిపోయినా, దానిలో సీమాంధ్రులకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఆయన సీమాంధ్రుల మీద విషం కక్కడం మానలేదు.
ఇలా ఓడిపోయాడో లేదో అలా బయటకి వచ్చిన మధు యాష్కి తాను వున్న కాంగ్రెస్ పార్టీని కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితిని పొగడ్డం మొదలెట్టాడు. టీఆర్ఎస్ సూపర్‌గా గెలిచిందని సర్టిఫికెట్ ఇచ్చాడు. అక్కడితే ఆగితే బాగుండేది, తాను ఓడిపోవడం బాధ కలిగించడం లేదుగానీ, తెలంగాణలో టీడీపీ, వైకాపా గెలవటం తనకి బాధ కలిగిస్తోందని అన్నాడు. ఓడిపోయిన పెద్దమనిషి ఇంట్లో కూర్చోడంట. సామాజిక తెలంగాణ కోసం పాటుపడుతూనే వుంటాడట.