గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తో లోకేష్ భేటీ.. ఏఐ డేటా సెంటరే కాదు..ఇంకా ఎన్నో

అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తో భేటీ అయ్యారు.  గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, గ్లోబల్ నెట్‌వర్కింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే కూడా పాల్గొన్న ఈ భేటీలో  ఆంధ్రప్రదేశ్ లో డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పటిష్టతకు, ఉద్యోగ కల్పనకు సంబంధించి చర్చ జరిగింది. ముఖ్యంగా విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఏఐ డటా సెంటర్ పనుల పురోగతిపై ఈ భేటీలో సమీక్షించారు.     విశాఖ ఏఐ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కు అనుబంధంగా   విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పోరేషన్ భాగస్వామ్యంతో డేటా సెంటర్–సర్వర్ తయారీ ఎకో సిస్టమ్ ను  రాష్ట్రంలో నెలకొల్పడానికి గూగుల్ సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు.  

అలాగే ఆంధ్రప్రదేశ్‌లో  డ్రోన్ సిటీ ప్రాజెక్ట్ పై కూడా మంత్రి లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రాజెక్ట్‌లో డ్రోన్ అసెంబ్లీ, క్యాలిబ్రేషన్, టెస్టింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని సుందర్ పిచాయ్ ను కోరారు. 
ప్రస్తుతం గూగుల్ సంస్థకు చెందిన డ్రోన్ విభాగం  వింగ్స్ డ్రోన్‌లు చెన్నైలోని ఫాక్స్‌కాన్‌తో కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ద్వారా తయారవుతున్నాయని సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనపై సంస్థలో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని  హామీ ఇచ్చారు. ఈ యూనిట్ ఏర్పాటు ద్వారా ఏపీ ఏరోస్పేస్  టెక్నాలజీ విభాగంలో పారిశ్రామికీకరణను సాధించే అవకాశం ఉంది. 

 భారతదేశంలో క్లౌడ్ రీజియన్‌ల విస్తరణతో పాటు, గూగుల్ ఫర్ స్టార్టప్స్ యాక్సిలరేటర్ కార్యక్రమం ద్వారా దేశీయ స్టార్టప్‌లకు తమ సంస్థ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. ప్రతి నెలా 500 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు గూగుల్ ఉత్పత్తులను వినియోగిస్తున్న నేపథ్యంలో, ఈ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ డిజిటల్ క్యాపిటల్ హోదాను బలోపేతం చేయనున్నాయి.

ఈ కీలక భేటీ ఆంధ్రప్రదేశ్ లో  ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, ఏరోస్పేస్ వంటి ఫ్యూచర్‌స్టిక్ టెక్నాలజీలలో తన స్థానాన్ని పదిలం చేసుకుంటూ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మ్యాప్‌లో ముఖ్యమైన గమ్యస్థానంగా రూపాంతరం చెందేందుకు లోకేష్ దృష్టిసారించినట్లు అవగతమౌతుంది.  

ఆంధ్రప్రదేశ్‌కు భారీ టెక్నాలజీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో  మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన సాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలైన ఇంటెల్, ఎన్విడియా సంస్థల ఉన్నతాధికారులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో సెమీకండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను   వివరించారు.

శాంటాక్లారాలోని ఇంటెల్ కేంద్ర కార్యాలయంలో ఆ సంస్థ ఐటీ విభాగం సీటీవో శేష కృష్ణపురతో  భేటీలో లోకేష్ ఆంధ్రప్రదేశ్‌లో సెమీకండక్టర్ల తయారీకి అపార అవకాశాలు, అనుకూల వాతావరణం ఉందన్నారు.  విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు ఉన్నాయని, ఇంటెల్ ఉత్పత్తుల కోసం అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్   యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే.. ఐఐటీ తిరుపతి లేదా ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీ భాగస్వామ్యంతో అమరావతిలో  ఇంటెల్ ఏఐ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలన్నారు.  రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించేందుకు ఇంటెల్ శిక్షణ కార్యక్రమాలను పాఠ్యప్రణాళికలో చేర్చాలని, యూనివర్సిటీలలో  ఇంటెల్ స్కిల్ ల్యాబ్స్" స్థాపించాలని కోరారు.

అలాగే చిప్ డిజైనింగ్ దిగ్గజం ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ రాజ్ మిర్ పూరితో  సమావేశమైన లోకేష్ ఏపీలో ఏఐ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి సహకరించాలని కోరారు. రాష్ట్రంలో ఎన్విడియా టెక్నాలజీతో ఒక  స్మార్ట్ ఫ్యాక్టరీ పైలట్ ప్రాజెక్ట్  ప్రారంభించాలని ప్రతిపాదించారు. అలాగే రాష్ట్రంలో డీప్‌టెక్ స్టార్టప్‌లకు పెట్టుబడులు, మోంటార్ సహకారం అందించాలనీ,  ప్రభుత్వ అధికారులకు ఏఐపై శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావాలని  కోరారు. లోకేష్ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన  ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ రాజ్ మిర్ పూరి,  ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను తమ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఉప్పల్ స్టేడియంలో రేవంత్ వర్సెస్ మెస్సీ.. ఎప్పుడంటే?

సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ నెల 13న స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీతో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడేందుకు ప్రాక్టీస్ ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. “తెలంగాణ రైజింగ్ - 2047” విజన్‌ను క్రీడా వేదిక నుంచి మెస్సీ సహకారంతో ప్రపంచానికి మరింతగా పరిచయం చేయాలనే వ్యూహంతో తానే స్వయంగా గ్రౌండ్‌లోకి దిగుతున్నట్లు తెలిపారు.  తెలంగాణలో స్పోర్ట్స్ స్పిరిట్‌ను నలుమూలలా చాటి చెప్పడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. స్వయంగా ఫుట్‌బాల్ ఆటగాడైన రేవంత్..  తన బిజీ షెడ్యూల్స్ మధ్య కూడా సమయం చిక్కినప్పుడల్లా ఫుట్ బాల్ మైదానంలో   పరుగులు తీస్తూ, గోల్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. గత పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే, మే 12న హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి సీఎం ఫుట్‌బాల్ ఆడారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆట మధ్యలో షూ పాడైపోయినప్పటికీ, ఆయన ఏమాత్రం వెనుకడుగు వేయలేదు.. షూ లేకుండానే తన ఆటను కొనసాగించారు. ఈ మ్యాచ్‌లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఫహీం ఖురేషి, హెచ్‌సీయూ విద్యార్థులు పాల్గొన్నారు.  ఇక ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ తన ఇండియా పర్యటనలో భాగంగా భాగంగా డిసెంబర్ 13న హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా, హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మెస్సీ టీమ్‌తో సీఎం రేవంత్ రెడ్డి టీమ్ మ్యాచ్ ఆడనుంది. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌కు సీఎం సన్నద్ధమౌతున్నారు.   రోజంతా అధికారిక కార్యక్రమాలతో అలసిపోయినా, కూడా విశ్రాంతి అన్న మాటే మదిలోకి రానీయకుండా  ఫుట్‌బాల్ ఆటగాళ్లతో కలిసి సీఎం  ఆదివారం రాత్రి గ్రౌండ్‌లోకి దిగారు. యువతతో కలిసి ఆయన ఉత్సాహంగా ఫుట్‌బాల్ ఆడారు.   దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో   వైరల్ అవుతున్నాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా రాష్ట్రంలో క్రీడా రంగాన్ని కూడా బలోపేతం చేసేందుకు, ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. మెస్సీతో మ్యాచ్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచం దృష్టిని తెలంగాణ వైపు తిప్పుకోవడానికి, రాష్ట్రంలో క్రీడలకు ఉన్న ప్రాధాన్యతను అంతర్జాతీయ స్థాయిలో తెలియజేయడానికి ఈ మ్యాచ్ దోహదపడుతుందని భావిస్తున్నారు. గోట్ టూర్​లో భాగంగా ఈ నెల 13న హైదరాబాద్‌కు వస్తున్న మెస్సీ టీంతో రేవంత్‌రెడ్డి ఫుట్ బాల్ మ్యాచ్‌లో తలపడనున్నారు. 13న ఉప్పల్ స్టేడియంలో జరిగే  ఈ ఫ్రెండ్లీ ఫ్లెండ్లీ మ్యాచ్ లో  రేవంత్‌.. 9వ నెంబర్‌ జెర్సీని.. మెస్సీ.. 10వ నెంబర్‌ జెర్సీ ధరించి గ్రౌండ్‌లోకి దిగుతారు. ఒక ముఖ్యమంత్రి.. ప్రముఖ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ గ్రౌండ్‌లో తలపడనుండటం క్రేజ్‌తోపాటు ఆసక్తిని రేపుతోంది.

స్టార్టప్ ల కోసం వెయ్యి కోట్లతో ప్రత్యేక నిథి.. సీఎం రేవంత్

తెలంగాణలో స్టార్టప్ లకు భారీ ప్రోత్సహకాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో స్టార్టప్ ల అభివృద్ధి కోసం వెయ్యి కోట్లతో నిధి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్  లో గూగూల్ ఫర్ స్టార్టప్ హబ్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగా స్టార్టప్ లకు భారీ ప్రోత్సహకాలను ప్రకటించారు. ప్రభుత్వ ప్రోత్సహకాలను వినియోగించుకుని స్టార్టప్ లు భవిష్యత్ లో గూగుల్ వంటి సంస్థలుగా విస్తరించాలని పిలుపునిచ్చారు.   రాష్ట్రంలో స్టార్టప్‌ల వృద్ధికి అనువైన వాతావరణాన్ని కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న ఆయన గూగుల్ ఒక స్టార్టప్ గా ఆరంభమై ప్రపంచ దిగ్గజంగా ఎదిగిన విషయాన్ని   అదే స్ఫూర్తితో మన స్టార్టప్‌లు కూడా ఎదగాలన్నారు. గూగుల్, యాపిల్, అమెజాన్ వంటి సంస్థలు 20 ఏళ్ల క్రితం చిన్న స్టార్టప్‌లుగా మొదలైనవేనన్న ఆయన, ఇప్పుడవి  బిలియన్ డాలర్ల కంపెనీలుగా మారాయన్నారు. "హైదరాబాద్ కేవలం స్టార్టప్ హబ్‌గా మిగిలిపోకుండా ఇక్కడి స్టార్టప్ లు యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలని ఆకాం క్షించారు. 2034 నాటికి తెలంగాణను   ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యంలో స్టార్టప్‌లు కీలక పాత్ర పోషించాలన్నారు. 

మన్యంలో మావోయిస్టు బ్యానర్ల కలకలం

ఆపరేషన్ కగార్ తో మావోయిస్టు పార్టీ కకావికలమైపోయిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పలువురు మావోయిస్టు అగ్రనేతలు లొంగుబాట పట్టారు. సాయుధ పోరాటాన్ని విఫల ప్రయోగంగా అభివర్ణించారు. ఇంకా చాలా మంది మావోలు, కేంద్ర కమిటీ నాయకులు ఎన్ కౌంటర్లలో హతమయ్యారు. ఇకేముందు.. మావోయిస్టు పార్టీ పనైపోయిందన్న చర్చలూ పెద్ద ఎత్తున సాగాయి. సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టుల పోస్టర్లు, బ్యానర్లు ఆంధ్రప్రదేశ్ మన్యంలో సంచలనం రేపాయి. మావోయిస్టుల సంచారం పెద్దగా కనిపించని అల్లూరి మన్యంలో ఇటీవల ఎన్ కౌంటర్ లో హతమైన మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు నివాళులర్పిస్తూ మావోయిస్టులు బ్యానర్లు ఏర్పాటు చేశారు.  ముంచంగిపుట్టు మండలం  కుమ్మిపుట్టు గ్రామ సమీపంలో ప్రధాన రహదారి పక్కన చెట్టుకు మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు నివాళులర్పిస్తూ బ్యానర్లు దర్శనమిచ్చాయి. ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్న క్రమంలో ఇప్పుడు ఏజెన్సీలో మావోయిస్టుల బ్యానర్లు సంచలనం సృష్టించాయి. ఆయుధాలను విడిచే ప్రశ్నే లేదనీ, లొంగుబాటుకు మావోయిస్టులు ప్రభుత్వాలతో ఎటువంటి  ఒప్పందం కుదుర్చుకోలేదనీ ఇటీవల మావోయిస్టు అగ్రనేత వికల్ప్ పేర లేఖ విడుదలైన నేపథ్యంలో ఇప్పుడు ఈ బ్యానర్లు వెలియడం ప్రాధాన్యత సంతరించుకుంది. మావోయిస్టులు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నారన్న అనుమానాలకు ఈ బ్యానర్లు తావిచ్చాయి. 

రాజ్యాంగాన్నే మార్చుకున్నాం.. బిజినెస్ రూల్సెంత.. చంద్రబాబు

మెరుగైన పాలన కోసం అవసరమైతే బిజినెస్ రూల్స్ మార్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఏపీ సచివాలయంలో  మంత్రులు, హెచ్ ఓడీలు, కార్యదర్శులతో ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడిన ఆయన దేశంలో రాజ్యాంగాన్నే అనేక సార్లు సవరించుకున్నాం.. ప్రజలకు మంచి చేయడానికి బిజినెస్ రూల్స్ మార్చుకుంటే తప్పేంటన్నారు.  ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయడంతో పాటు  అనవసర ఫైళ్లు సృష్టించే విధానం మారాలనీ, దీని కోసం అవసరమైన మార్పులకు వెనుకాడొద్దని చెప్పారు. పరిపాలనను సులభతరం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్న ఆయన ఇందు కోసం అధికారులు అనవసరంగా ఉన్న నిబంధనలను తొలగించాలని  సూచించారు.   టెక్నాలజీ, డేటా లేక్ ద్వారా మరింత సమర్థంగా పాలన అందించానీ, ప్రతి శాఖలో ఆడిటింగ్ జరగాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా పాలన ఉండాలని నిర్దేశించారు. ఆన్ లైన్ సేవలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా అవసరమైతే  బిజినెస్ రూల్స్ ను మార్చాలన్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులను వాడుకోవడానికి తమ ప్రభుత్వం నూతన నిబంధనలు తెచ్చిందని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు.

గాడిన పడిన ఇండిగో విమాన సర్వీసులు!

ఇండిగో   సంక్షోభం ముగిసింది. ఇండిగో విమాన సర్వీసులు దాదాపుగా సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈవో పీటర్ ఎల్పర్స్ ప్రకటించారు. బుధవారం (డిసెంబర్ 10) నాటికి పరిస్థితిని చక్కదిద్దుతామన్న ఆ సంస్థ తన మాటను నలిబెట్టుకుంది.  ఈ సందర్భంగా ఇండిగో సీఈవో గత రెండు దశాబ్దాలుగా ఇంతటి ఘోర పరిస్థితి ఎన్నడూ ఎదురు కాలేదనీ, మళ్లీ ఇటువంటి పరిస్థితి పునరావృతం కానీయబోమని చెప్పారు.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో సేవలు సాధారణ స్థితికి చేరుకున్నాయన్న ఆయన ఇక మీదట ఇండిగో విమాన సేవల్లో ఎటువంటి అసౌకర్యం కలిగే ప్రసక్తి ఉండదని హామీ ఇచ్చారు.  దేశీయ విమానయాన సంస్థ ఇండిగో  విమానాల రద్దుతో ఎనిమిది రోజులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు చేసి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినందుకు 24 గంటల్లోగా వివరాలు ఇవ్వాలంటూ సంస్థ సీఈవో పీటర్‌ ఎల్బర్స్‌, సీవోవోలకు డీజేసీఏ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇండిగోపై విచారణ కమిటీ వేసిన కేంద్రం దాని నివేదిక రాగానే సంస్థపై చర్యలు చేపనున్నట్లు పేర్కొంది.  తమ విమానయాన నెట్‌వర్క్‌ను దాదాపు పునరుద్ధరించినట్లు ఇండిగో  బుధవారం (డిసెంబర్ 10) తెలిపింది. తమ సంస్థ 138 గమ్య స్థానాలకు రాకపోకలు సాగిస్తుండగా, అందులో 135 గమ్యస్థానాలకు సేవలు తిరిగి ప్రారంభించామంది. 95 శాతం మేర రూట్లు రీకనెక్ట్‌ అయ్యాయని వివరించింది. ప్రస్తుతం ఇండిగో నడిపే పైలట్ల సంఖ్య 700 ఉండగా, వాటిని 1500కు పెంచి ప్రజలకు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని పేర్కొంది.   విమానాలను రద్దు చేసి తీవ్ర గందరగోళం సృష్టించిన ఇండిగో విమానయాన సంస్థ ప్రయాణికుల టికెట్ల చార్జీ రీఫండ్‌ ప్రక్రియ ప్రారంభించింది.  అయితే రీఫండ్‌ సందర్భంగా ఎలాంటి అదనపు చార్జీ వసూలు చేయరాదని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడమే కాక, కొన్ని మార్గదర్శకాలు నిర్దేశించింది. ఇప్పటివరకు ప్రయాణికులకు ఇండిగో రూ.610 కోట్లను రీఫండ్‌ ఇచ్చిందని, అలాగే దేశ వ్యాప్తంగా 3,000 లగేజీలను వారికి అందజేసిందని పౌర విమానయాన శాఖ  ప్రకటించింది. ప్రస్తుతం ఎయిర్‌లైన్స్‌ ఆన్‌టైమ్‌ పనితీరు 75 శాతానికి చేరుకుందని, విమానాల రద్దు ప్రయాణికులు అనవసరంగా విమానాశ్రయానికి రాకుండా నిరోధించడంలో సహాయపడ్డాయని సంస్థ సీఈవో పీటర్‌ ఎల్‌బర్స్‌ తెలిపారు. మొత్తానికి డిసెంబర్‌ 10వ తేదీ నాటికి సర్వీసులు పూర్తిగా చక్కబడటంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇండిగో ఎయిర్ లైన్స్ పరిస్థితులు మెరుగుపడుతున్నాయని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పార్లమెంటులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంగళవారం (డిసెంబర్ 9)   ప్రకటించారు.  

ఇన్వెస్టర్ల విశ్వాసం చూరగొన్న రేవంత్ సర్కార్.. గ్లోబల్ సమ్మిట్‌లో పెట్టుబడుల వెల్లువ!

  తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు అనూహ్య స్పందన లభించింది. ఈ సదస్సు వేదికగా  ఊహించిన దాని కంటే రెట్టింపుగా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మొత్తంగా రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో మొత్తం 5 లక్షల 75 వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబుడులు రాష్ట్రానికి వచ్చాయి.  తొలి రోజు సదస్సులో   2 లక్షల 43 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి.. కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో  అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అలాగే.. రెండో రోజు కూడా  ఈ జోష్ ఏమాత్రం తగ్గలేదు. రెండో రోజు సదస్సులో  3 లక్షల కోట్లకు పైన పెట్టుబడులకు సంబంధించిన ఎంవోయూలు కుదిరాయి.  రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ లో ఒక్క పవర్ సెక్టార్‌లోనే  3 లక్షల 24 వేల 698 కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదిరాయి.  అలాగే ఫుడ్ ప్రాసెసింగ్, డేటా సెంటర్లు, ఫార్మా సెక్టార్, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, టూరిజం రంగాల్లో భారీగా ఇన్వెస్ట్ చేయడానికి సంస్థలు ముందుకు వచ్చాయి.  ప్రముఖ నటుడు అజయ్ దేవగన్  స్టూడియోలు, వీఎఫ్ఎక్స్, వర్క్ షాప్‌ల లాంటి ఫిల్మ్ ఎకోసిస్టమ్‌ను.. పీపీపీ మోడల్‌లో డెవలప్ చేయడానికి ముందుకు వచ్చారు.  ఇక  ఫిఫా-ఏఐఎఫ్ఎఫ్ ఫుట్‌బాల్ అకాడమీ టాలెంట్ అభివృద్ధికి.. ప్రపంచ స్థాయి అకాడమీ హైదరాబాద్‌లో స్థాపించనున్నాయి. తెలంగాణని గ్లోబల్ హకీ హబ్‌గా మార్చేందుకు, హాకీ మహిళల వరల్డ్ కప్ క్వాలిఫయర్ 2026ని.. 8 దేశాలు పాల్గొనే అంతర్జాతీయ పోటీని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నారు. 18 దేశాలు పాల్గొనే ఏషియా రోయింగ్ ఛాంపియన్‌షిప్ 2026ని నిర్వహించనున్నారు. వచ్చే ఏడాదిలో.. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్.. ప్రపంచంలోనే అతిపెద్ద చెస్ ఉత్సవం కానుంది.  ఇన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లు చూశాక  తెలంగాణ రైజింగ్ అన్‌స్టాపబుల్‌ అన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.  రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత.. దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిది ద్దేందుకు ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ చరిత్రలోనే ఈ గ్లోబల్  సమ్మిట్ ఓ మైల్ స్టోన్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదంటున్నారు దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు కీలక రంగాల్లో  రాష్ట్ర ప్రభుత్వంలో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు పోటీ పడ్డాయి.   గ్లోబల్ సమ్మిట్ లో రాష్ట్ర ప్రభుత్వంతో దిగ్గజ సంస్థలు కుదుర్చుకున్న ఎంవోయూలు  తెలంగాణ రైజింగ్-2047 విజన్ సాధనలో కీలకపాత్ర పోషించనున్నాయని పరిశీలకులు విశ్లేషి స్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం  ఫోకస్ చేసిన డీప్ టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, డేటా సెంటర్లు, విద్యుత్, కోర్ ఇన్‌ఫ్రా లాంటి భవిష్యత్ రంగాలలోనే ఇన్వెస్టర్లు భారీగా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఈ భారీ పెట్టుబడులు గ్రౌండ్ అయ్యి, ఆయా సంస్థలు తమ కార్యకలాపాలు చేపట్టడంతోనే  రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించడం ఖాయమని అంటున్నారు.  రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్  ప్రభుత్వం  పరిశ్రమలకు అందిస్తున్న మద్దతు, సుస్థిర విధానాలపై  పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పొందిందనడానికి గ్లోబల్ సమ్మిట్ లో వెల్లువెత్తిన పెట్టుబడులే తార్కానం అని చెప్పవచ్చు. ఈ గ్లోబల్ సమ్మిట్ కేవలం   ఓ ఆర్థిక సదస్సుగా కాకుండా, భవిష్యత్ తెలంగాణకు ఒక రోడ్ మ్యాప్‌ని, భరోసాని ఇచ్చిందని చెప్పవచ్చు.  ఈ సమ్మిట్ ఇంతలా సక్సెస్ కావడానికి  త్రీ జోన్ గ్రోత్ స్ట్రాటజీ కూడా ఒక ప్రధాన కారణంగా పరిశీలకులు చెబుతున్నారు. రాష్ట్రంలో సమతుల్య అభివృద్ధి కోసం ఆర్థిక వ్యవస్థను క్యూర్ జోన్, ప్యూర్ జోన్, రేర్ జోన్ అంటూ మూడు ప్రత్యేక జోన్‌లుగా విభజించారు. ఇది.  క్యూర్ జోన్‌లో హైదరాబాద్‌ కేంద్రంగా హై-ఎండ్ సర్వీసెస్, టెక్నాలజీ, అర్బన్ ఇన్నోవేషన్ రంగాలపైనా,  ప్యూర్ జోన్‌లో నగర శివారు ప్రాంతాల్లో మ్యానుఫాక్చరింగ్, దాని అనుబంధ రంగాలపైనా, ఇక  రేర్ జోన్‌లో.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పాదకత, అగ్రి ప్రాసెసింగ్, గ్రామీణాభివృద్ధి పై సర్కార్ దృష్టి పెట్టింది. ఈ స్ట్రాటజీ ఇన్వెస్టర్లు, ఇండస్ట్రియలిస్టులను విశేషంగా అకర్షించిందని పరిశీలకులు అంటున్నారు.  ఇప్పటికే.. దేశ జనాభాలో దాదాపు 3 శాతం ఉన్న తెలంగాణ.. నేషనల్ జీడీపీలో 5 శాతం సమకూరుస్తోంది. 2047 నాటికి.. ఈ మొత్తాన్ని 10 శాతానికి పెంచాలన్న లక్ష్యం సాధించే దిశగా ప్రభుత్వ అడుగులు ఉన్నాయని ఈ సదస్సు వేదికగా తేటతెల్లమైందంటున్నారు.

అనిల్ అంబానీ కుమారుడిపై సీబీఐ కేసు

ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ కుమారుడు జై అన్ మోల్ అనిల్ అంబానీపై  కేంద్ర దర్యాప్తు సంస్థ  సీబీఐ   కేసు నమోదు చేసింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో కలిసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.228 కోట్ల మేర ఆర్థిక నష్టం కలిగించారంటూ ఆ బ్యాంక్ ఫిర్యాదుపై  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.  రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ తన  వ్యాపార కార్యకలాపాల కోసం ముంబైలోని స్పెషలైజ్డ్ ఎస్‌సీఎఫ్ బ్రాంచ్ నుండి రూ.450 కోట్ల క్రెడిట్ ఫెసిలిటీ పొందింది. ఈ రుణం మంజూరులో భాగంగా కంపెనీ సకాలంలో వాయిదాలు, వడ్డీ చెల్లింపులు, భద్రత, ఇతర నిబంధనలను పాటించడం వంటి  ఆర్థిక క్రమశిక్షణను   రిలయెన్స్ హోం ఫైనాన్స విఫలం కావడంతో  బ్యాంకు 2019లోనే  ఈ లోన్ అకౌంట్ ను నిరర్థక ఆస్తిగా బ్యాంక్ వర్గీకరించింది. నిబంధనలు గుర్తుచేసినా, పర్యవేక్షణ చేసినా కంపెనీ పదేపదే డిఫాల్ట్  అవ్వడంతో ఫిర్యాదు చేసింది.  తీసుకున్న నిధులను  ఇతర వ్యాపార ప్రయోజనాల కోసం మళ్లించి దుర్వినియోగం చేశారని ఆడిట్ గుర్తించింది.   అయితే ఈ ఆరోపణలపై రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.  

మరో పోలీస్ అధికారిపై వేటు వేసిన సీపీ సజ్జనార్

హైదరాబాద్ లో మరో పోలీసు అధికారిపై వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం,  భూవివాదాల్లో జోక్యం వంటి వాటికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపై సీపీ సజ్జనార్  ఇటీవల కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిదే. ఆ క్రమంలోనే  తాజాగా కూల్సుంపుర ఏసీపీ మునావర్‌పై చర్య తీసుకున్నారు.  ఆయనను తక్షణమే హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేయాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ఏసీపీ మునావర్‌పై అవినీతి ఆరోపణలు, భూ వివాదాల్లో జోక్యం, కొన్ని కేసుల్లో  అనచితంగా వ్యవహరించారన్న  పలు ఫిర్యాదులు అందడంతో సిపి సజ్జనార్  పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. అధికారుల విచారణలో కుల్సంపుర ఏసీపి మునావర్ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు తేలడంతో ఆయన పై చర్యలు తీసుకున్నారు.  మునావర్  సిబ్బందిపై దురుసు ప్రవర్తన, తన మాట వినని పోలీస్ సిబ్బందిని పరువు తీసే విధంగా వ్యవహరించినట్లు వచ్చిన ఆరోపణలు కూడా కమిషనర్ దృష్టికి వచ్చాయి. దీనిపై సీపీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆరోపణలు నిజమని విచారణలో తేలడంతో హైదరాబాద్ సిపి సజ్జనార్.. కుల్సంపుర ఏసిపి మునావర్ ను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.ఇంతకుముందే టప్పాచబుట్ర ఇన్‌స్పెక్టర్ అభిషిలాష్, కూల్సుంపుర ఇన్‌స్పెక్టర్ సునీల్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో వారిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా మరో ముగ్గురు ఇన్‌స్పెక్టర్ల పనితీరు, వ్యవహారశైలిపై కూడా కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

తెలంగాణ అన్ స్టాపబుల్ మాత్రమే కాదు..అన్ బీటబుల్!

భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగిన   తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో  భాగస్వామిని అయినందుకు ఆనందంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. వచ్చే పాతికేళ్లలో తెలంగాణను  దేశంలోనే అభివృద్ది చెందిన రాష్ట్రం గా తెలంగాణ అన్న లక్ష్యంతో కృషి చేయాలన్న ఆశయం మహోత్కృష్టమైనదన్నారు. గ్లోబల్ సమ్మిట్ లో    భాగంగా మంగళవారం (డిసెంబర్ 9) విజన్ డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో   ప్రసంగించిన దువ్వూరి సుబ్బారావు.. తను అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో   ఆర్థిక కార్యదర్శిగా,  ఖమ్మం కలెక్టర్ గా పనిచేశానని గుర్తు చేసుకున్నారు.   ఇప్పుడు తాను హైదరాబాద్ వాడిననీ, తనది తెలంగాణ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని పేర్కొన్నారు.   తెలంగాణ అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాపబుల్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని, తాను తెలంగాణ అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీటబుల్  అంటున్నానని చెప్పారు.   చైనాలోని గ్వాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డాంగ్ ప్రావిన్స్ మోడల్ ఆధారంగా తెలంగాణ ముందుకు సాగడం గొప్ప విషయమన్నారు.  2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సాధించడానికి,   ఏటా 8 నుంచి 9 శాతం వృద్ధి సాధించాలన్న దువ్వూరి సుబ్బారావు, ఇది నిజంగా ఒక చాలెంజ్, కొంచం కష్ట సాధ్యమే అయినప్పటికీ ఇంతటి గొప్ప లక్ష్యం పెట్టుకున్న సీఎం రేవంత్ ను అభినందిస్తున్నాన్నారు. హైదరాబాద్ ను అద్భుత నగరంగా అభివర్ణించిన దువ్వూరి సుబ్బారావు,  ఒకప్పుడు తెలంగాణ పేదరికంతో వెనుకబడి ఉండేది కానీ,  ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి దిశలో పయనిస్తోందన్నారు. రెండు దశాబ్దాల కిందట  ప్రజలందరూ బెంగళూరుకు వెళ్లేవారు, ప్పుడు అందరూ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తమ మొదటి ప్రాధాన్యంగా ఎంచుకుని ఇక్కడే స్థిరపడేందుకు ఇష్టపడుతున్నారనీ, దీన్ని బట్టే  తెలంగాణ గొప్పతనం ఏంటో అఅర్ధం చేసుకోవచ్చని దువ్వూరి అన్నారు.   తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ, నీతి ఆయోగ్ సంస్థలకు చెందిన మేధావులతో రూపొందించడం అభినందనీయమన్న ఆయన  సలహా మండలి సభ్యుడిగా ఈ డాక్యుమెంట్ అమ లుకు తన వంతు కృషి చేస్తానన్నారు.  హైదరాబాద్ ఇప్పటికే ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, జీసీసీల్లో అభివృద్ధి సాధించిందనీ,  ఇప్పుడిక తయారీ రంగం, వ్యవసాయ రంగం, ఇతర ఉపాధి రంగాలు, మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్షర్, సోషల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విద్య, వైద్యంపై దృష్టి పెట్టాలని సూచించారు.    

సీఎంవో, లోక్ భవన్‌కు బాంబు బెదిరింపు!

తెలంగాణలో అత్యంత కీలకమైన సీఎంవో, లోక్ భవన్ లకు బాంబు బెదరింపు మెయిల్ కలకలం రేపింది. ఏకంగా గవర్నర్ కార్యాలయానికి వచ్చిన ఈ బెదరింపు ఈమెయిల్ లో ముఖ్యమంత్రి కార్యాలయం, లోక్ భవన్ లను బాంబులతో పేల్చివేయాడానికి కుట్ర జరుగుతోందని హెచ్చరిక ఉంది.  విశ్వసనీయ సమాచారం మేరకు వాసుకిఖాన్ పేరుతో ఈ ఈమెయిల్ వచ్చింది.  ఈ మెయిల్ సీఎంవో మరియు లోక్ భవన్‌ను వెంటనే ఖాళీ చేయాలని,  పెద్ద ప్రమాదం సంభవించబోతోందన్న హెచ్చరిక ఉంది. ప్రభుత్వ ప్రముఖులు, వీఐపీలు ప్రాణాపాయంలో ఉంటారని ఆ మెయిల్ హెచ్చరించింది.  ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన గవర్నర్ కార్యాలయం, ఈ నెల 3న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేసింది. గవర్నర్ సిఎస్ఓ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తి నిజంగా ఎవరు? వాసుకి ఖాన్ పేరు అసలుదా? ఇది కేవలం భయపెట్టేందుకా? లేక మరేదైనా కుట్రలో భాగమా? అన్న అనుమానాల దృష్ట్యా సైబర్‌ నిపుణుల సహాయంతో పంజాగుట్ట పోలీసులు ఇమెయిల్ సోర్స్ మరియు ఐపీ వివరాలను ట్రాక్ చేస్తున్నారు. భద్రతా సంస్థలు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.సీఎంవో, లోక్ భవన్ భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారని తెలిసింది.