దివ్యాంగ ప్రతిభావంతులకు లాప్‌టాప్ బహుమతి!
posted on Jul 8, 2024 @ 6:53PM
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్రంలోని పలువురు దివ్యాంగ విద్యార్థులు ప్రతిభను కనబరిచి ప్రముఖ విద్యాసంస్థల్లో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా వాళ్ళు మంత్రి లోకేష్‌ని కలసి కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగుల సమస్యను అర్థం చేసుకున్న లోకేష్ ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన జీవో నంబర్ 225 విడుదల చేశారు. దీనివల్ల రాష్ట్రంలోని పలువురు దివ్యాంగులకు మేలు జరిగింది. ఈ జీవో వల్ల ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో 25 మంది దివ్యాంగ విద్యార్థులు సీట్లు సాధించారు. వారందరూ తమ తల్లిదండ్రులతో కలసి ఉండవల్లిలోని నారా లోకేష్ నివాసానికి వచ్చి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను మంత్రి అభినందించి, వారికి లాప్‌టాప్‌లను బహుకరించారున. ‘సింపుల్ గవర్నమెంట్ - ఎఫెక్టివ్ గవర్నెన్స్’ విధానంతో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడమే తమ లక్ష్యమని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా అన్నారు.