వర్తమానంలో జీవించండి
posted on Nov 15, 2024 @ 4:02PM
హైద్రాబాద్ శాలిబండ మండలంలోని గాజిబండలో ప్రతీ కుటుంబంలో ఎవరో ఒకరు విదేశాలకు వెళుతున్నారు. సిరాజ్ కు ఇది నచ్చలేదు. ఇండియాలో ఉండిపోవాలనుకున్న తనకు ఇది ఇబ్బందిగా పరిణమించింది. ఒక రోజు మౌలా దగ్గరికి వచ్చాడు. తన అనుమానాన్ని నివృత్తి చేసుకున్నాడు. మౌలానా లోకం పోకడలను కూలకషంగా చెప్పాడు.
మౌలానా తక్రీర్( ప్రవచనం) ప్రారంభించాడు. అల్లా చెప్పేది ఒకటే . అల్లా తలచుకుంటే ఒక్కసెకనులో అన్నీ గుంజేసుకుంటాడు. పులికి ఒక మంచి జీవితం ఉంది. బాగా ఆకలేస్తే మంచి జింకను వేటాడి తింటుంది. మనుషులు జంతువులు ఒకేలా జీవించగలవు. నాణ్యమైన జీవితం కోసం మనుషులు విదేశాలకు వెళుతుంటారు. పులి లేదా సింహానికి సమయానికి బలవర్ధకమైన జింక మాంసాహారం అవసరం. ఆయా సీజన్ బట్టీ గుహ అవసరం. ఎండాకాలం, వానా కాలం , వర్షా కాలం బట్టి గుహలు ఏర్పరచుకుంటాయి. పిల్లి తన పిల్లి కూనలు పుట్టిన తర్వాత వాటిని సాకడానికి నానా హైరానా పడుతుంది. ఇల్లు కూడా మార్చేస్తుంది. కుందేలు కూడా అదే విధంగా చేస్తుంది.తన శరీరం మీద ఉన్న వెంట్రుకలను తీసి మెత్తటి కార్పెట్ మాదిరిగా తయారుచేస్తుంది. తన పిల్లలను వెచ్చగా పడుకోబెడుతుంది. మనుషులు చదువు వల్ల మంచి ఉద్యోగం ఇవన్నీ మన శరీరాన్ని కాపాడుకోవడం కోసమే. జంతువులు కూడా శరీరాన్ని కాపాడుకుంటున్నాయి. ఒక రోజు అడవిలో సింహం పెళ్లి జరిగింది. సింహం మనుషుల మాదిరిగా ఆలోచిస్తే మరోలా ఉంటుంది. సింహం పెళ్లిలో ఏనుగు, చిరుతపులి, ఎలుగుబంటి, జిరాఫీ వంటి జంతువులను మాత్రమే ఆహ్వానిస్తుంది. నా బరాత్ లో అల్ప జీవులు రాకూడదని కోరుకుంది. ఒక రోజు చిట్టెలుక సింహం పెళ్లిలో కనిపిస్తుంది. సింహానికి కోపం వస్తుంది. చిట్టెలుకను నిలదీస్తుంది. నువ్వెందుకు వచ్చావని అడుగుతుంది. అప్పుడు చిట్టెలుక కూల్ గా జవాబిస్తుంది. పెళ్లికి ముందు నీ లాగే (సింహం) ఉండే వాడిని. పెళ్లయిన తర్వాత ఎలుక అవతారమెత్తాను. మనుషులు ప్రకృతికి విరుద్దంగా ఆలోచిస్తున్నారు.
దంపతులు ఈ మధ్య కాలంలో ఇద్దరు పిల్లలు పుడితే ఎలా అని టెన్షన్ పడుతున్నారు. నాకు తెలిసిన ఈ జంటకు పదేళ్లుగా పిల్లలు కలగలేదు. అయినా టెన్షన్ పడుతున్నారు. పక్షులు, జంతువులు కేవలం తమ ఆహార అన్వేషణ సాయంత్రం వరకే . చీకటి పడకముందే గూట్లో కి వచ్చి నిద్రపోతాయి. మళ్లీ తెల్లవారిన తర్వాత మళ్లీ వేట ప్రారంభిస్తాయి.ఆహార అన్వేషణ తప్పితే వేరే ఆలోచనలు ఆ జీవాలకు ఉండవు. కనుక వాటికి బీపీ, షుగర్ వంటి వ్యాధులు దరి చేరవు. మనిషి గతం నెమరేసుకుని బాధపడతాడు. భవిషత్తు గూర్చి ఆందోళన చెందుతాడు. వర్త మానంలో జీవిస్తే ఉన్న సుఖం మరెక్కడా ఉండదు.