లిక్కర్ స్కాం కేజ్రీవాల్ కొంపముంచింది
posted on Feb 9, 2025 @ 3:23PM
భాషా: సలాం వాలేకుం మౌలానా సాబ్ సాబ్ . ఢిల్లీ లో అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయాడు. ఇస్లాంను నమ్మే అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడం బాధగా ఉంది. ముస్లిం రాజకీయనేతలే అల్లాకు ధన్యవాదాలు తెలిపిన సందర్బాలు అనేకం. ఒక హిందూ మతంలో పుట్టిన కేజ్రీవాల్ ఇస్లాంను అనుసరించి పాలన చేసినప్పటికీ మళ్లీ అధికారంలో రాలేకపోయాడు.
మౌలానా: చూడు భాషా అరవింద్ కేజ్రీవాల్ఉన్నత చదువులతో ప్రభుత్వోద్యోగంలో చేరాడు. అన్నాహజారే స్పూర్తితో అవినీతికి వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో హర్యానా రాజకీయాల్లో ఎంటర్ అయిన తర్వాత సక్సెస్ అయ్యాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత అవినీతికి కేరాఫ్ అడ్రస్ అయ్యాడు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఇస్లాం అమలు విషయంలో కానీ, ముస్లింల సంక్షేమం, అభివృద్ది విషయంలో చేసింది శూన్యం. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ‘మై అల్లా కో శుక్ రియా అదా కర్తా హుం ’ అనడం నేను విన్నాను. అల్లాకు కృతజ్ఞత చెప్పిన వ్యక్తి వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. లిక్కర్ స్కాం చేశాడు. ఇస్లాంలో లిక్కర్ వ్యాపారం మహాపాపం. ఇస్లాంలో మద్యపానం నిషేధం. ఖురాన్ కూడా ఇదే చెబుతుంది. త్రాగడం వల్ల మనిషి విచక్షణ కోల్పోతాడు. ఒక చుక్క మద్యం సేవించినా అపచారం. డాక్టర్ ప్రిస్కైబ్ చేసే మందులు పని చేయకపోతే వేరే మందులు ప్రిస్కైబ్ చేస్తాడు. మద్యం కూడా అంతే. వదిలేయాల్సిందే. అల్లాకు ఇష్టం లేని పని చేయకూడదు. రంజాన్ లో ఉపవాసదీక్షలు ప్రతీ ముస్లిం విధి. కానీ ఇస్లాంను అమలు చేయని వ్యక్తి ఉపవాసాలు చేసినప్పటికీ ఫలితం శూన్యం.
తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలో వచ్చిన టిఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో రాణించాలన్న కాంక్షతో బిఆర్ఎస్ గా రూపాంతం చెందింది. ఉద్యమనేత కెసీఆర్ కూతురు కవిత పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్ల అవినీతికి పాల్పడింది. ఢిల్లీలో మద్యం వ్యాపారానికి తెరలేపింది. అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ తో దోస్తీ చేసింది. లిక్కర్ స్కాం చేసింది. ప్రజలు బిఆర్ఎస్ ను ఓడించారు. ఆ తర్వాత ఇద్దరూ జైలుపాలయ్యారు. అటు తెలగాణలో బిఆర్ఎస్ ను ఇటు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఇంటికి పంపించారు. చూశావా భాషా అల్లా ఎందుకోసం లిక్కర్ హరామ్ అన్నాడో అర్థమైందా
బదనపల్లి శ్రీనివాసాచారి