కరోనా సోకిన వారికి ఆ లక్షణాలు ఉంటే లక్కీనే.. లేటెస్ట్ స్టడీ
posted on Oct 12, 2020 @ 10:31AM
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తోంది. సామాన్య ప్రజల నుండి సీఎం లు, పీఎం లు, దేశాధ్యక్షులు దీని బారిన పడుతున్నారు. అయితే ఈ వైరస్ బారిన పడిన వారు రెండు వారాల తరువాత కోలుకుంటుండగా మరి కొంత మంది ఈ వైరస్ ధాటికి తట్టుకోలేక కన్నుమూస్తున్నారు. ఎవరికైనా కరోనా వైరస్ సోకిందని గుర్తించడానికి జలుబు, దగ్గు, తలనొప్పితో పాటు వాసనలను గుర్తించలేకపోవడం, రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు బయట పడతాయి. అయితే తాజాగా దీని పై ఒక రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్ ప్రకారం.. మిగిలిన లక్షణాల సంగతి ఎలా ఉన్నా... వాసనలు గుర్తించలేకపోయే వారికి మాత్రం కరోనా పెద్దగా హాని చేయకుండానే తగ్గిపోతోందని తేలింది. అంతేకాకుండా ఈ వాసనలను గుర్తించలేకపోవడం అనే లక్షణం కరోనా వైరస్ సోకిన ఐదు రోజుల తర్వాత కనిపిస్తోంది. దీనిని వెంటనే గుర్తించి ట్రీట్ మెంట్ తీసుకున్నవారికి ఎటువంటి హాని లేకుండా తేలికగానే తగ్గిపోతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు
కరోనా బారిన పడిన వారిలో.. ఎవరైతే వాసన కోల్పోతున్నారో వారు త్వరగా కోలుకుంటున్నారు. ఇదే విషయాన్నిఇరాన్‌లోని టెహ్రాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పరిశోధకులు, అలాగే ఇజ్రాయెల్‌కు చెందిన ప్రముఖ సంస్థలు చేసిన అధ్యయనాల్లో కూడా ఈ విషయమే తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (who) గుర్తించిన జామా జర్నల్... అక్టోబరు 8న రిలీజ్ చేసిన పరిశోధనా పత్రంలోకూడా ఈ విషయాన్ని చెప్పింది.