లగడపాటి చివరి ప్రెస్‌మీట్ వివరాలు
posted on May 14, 2014 @ 1:01PM
రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి రాజగోపాల్ బుధవారం తన చివరి రాజకీయ ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ ప్రెస్‌మీట్‌లో తాను నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే వివరాలను ప్రకటించారు. రాష్ట్రంలో, జాతీయవ్యాప్తంగా ఏ పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయనే విషయాన్ని ఆయన అంకెలతో సహా వివరించారు. సర్వే ఫలితాలను ప్రకటించిన అనంతరం లగడపాటి ఇది తన చివరి ప్రెస్ మీట్ అని ప్రకటించారు. ఇక నుంచి తన పేరు రాజకీయాల్లో వినిపించదని ఆయన తెలిపారు. తాను ఇప్పుడు వెల్లడించిన సర్వే ఫలితాలలో వ్యక్తిగతంలో ఏ పార్టీ మీ అభిమానంతోనో, ద్వేషంతోనే ప్రకటించినవి కావని చెప్పారు. తన రాజకీయ ప్రస్థానంలో తన పనుల ద్వారాగానీ, మాటల ద్వారాగానీ ఎవరినైనా బాధపెట్టి వుంటే క్షంతవ్యుడినని లగడపాటి చెప్పారు.