దిల్లీలో కుల్దీప్ జోరు..దక్షిణాఫ్రికా ఘోరపరాజయం
posted on Oct 11, 2022 @ 7:55PM
డీకాక్, మార్క్‌రమ్, హెండ్రిక్స్, మలాన్వంటి హేమాహేమీ లం తా ఆఖరికి క్లాసెన్‌తో సహా పేక ల్లా పడిపోయారంటే క్రికెట్ అభి మానులు అస్సలు నమ్మడం లేదు. అంతటి దక్షిణాఫ్రికా జట్టూ కేవలం 99 పరుగులకే డగౌట్‌కి చేరిందంటే గిల్లుకుని అవును నిజమే నంటున్నారు. భారత్ బౌలర్లు ముఖ్యంగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చాలాకాలం తర్వాత స్పిన్ తంత్రం అద్బు తంగా ప్రయోగించడంతో దక్షిణా ఫ్రికా 27.1 ఓవర్లలోనే 99 పరుగులకే చుట్టేసుకుపోయింది. భారత్ వంద పరుగుల లక్ష్యాన్ని 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పో యి సాధించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కుల్దీప్ యాదవ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ హైదరాబాదీ స్టార్ భారత్ పేసర్ సిరాజ్ గెలు చుకున్నాడు.
భారత్ టాస్ గెలిచి బవుమా జట్టుకు బ్యాటింగ్ అవకాశం ఇచ్చింది. మలాన్, డీకాక్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. రెండో ఓవర్లోనే డీకాక్ వెనుదిరిగాడు. వాషింగ్టన్ సుందర్ బంతిని సరిగా అర్ధంచేసుకోలేక వికెట్ సమర్పించుకున్నాడు. అలా మొదలైన మేడ కూలడం ఊహించని విధంగా ప్రేక్షకులను ఆనందం, ఆశ్చర్యభరితం చేసింది. ఎందుకంటే 5ఓవర్లకు 15 పరుగులు, 10 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 26 పరుగులే చేసింది. ఇది నిజమా కలా అనుకున్నారంతా. మర్క్‌రమ్, క్లాసెన్ క్రీజ్‌లో ఉన్నారు. ఇక రెచ్చి పోతారనే ప్రేక్షకులు అనుకున్నారు. ఎక్కడా, మన బౌలర్లు కదలనిస్తేగా. మార్క్‌రమ్‌ను షాబాజ్ అవుట్ చేసే సమయా నికి అతగాడు కేవలం 9 పరుగులే చేశాడు. దక్షిణాఫ్రికా అలా కుంటుతూ 50 పరుగులు చేరుకునేసరికి 4 వికెట్లు కోల్పోయింది. అసలు ఒక్క ఫోర్ చూద్దా మన్నా అప్పటికి 50 బంతులయిపోయా! క్లాసెన్ కాస్తంత చేతులు ఝాడించి పరు గులు తీయనారం భిం చాడు. 19వ ఓవర్‌కి డేవిడ్ మిల్లర్ పెవిలియన్ దారి పట్టి మరింత కొంపముంచాడు. అలా 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 73 పరుగులు మాత్రమే చేయగలిగారు. భారత్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తిప్పేయడం దక్షిణాఫ్రికా బ్యాట ర్లకు వరల్డ్ కప్ వరకూ తప్ప కుండా గుర్తుంటుంది. వీడెవడ్రా బాబూ.. అనుకునే ఉంటారు! అలా బౌలర్ల ధాటికి లొంగిపోయిన దక్షిణాఫ్రికా 27.1 ఓబర్లలో 99 పరుగులు చేసింది. స్టార్ బౌలర్ కుల్దీప్ తన కోటా 4.1 ఓవర్లలో 4.32 ఎకానమీతో 4 వికెట్లు తీసుకున్నాడు. కాగా సిరాజ్, ఆవేష్, సుందర్ కీలక సమయాల్లో రెండేసి వికెట్లు తీసి జట్టు విజయానికి తమ వంతు పాత్ర వహించారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో క్లాసెన్ అత్యధికంగా 42 బంతుల్లో 34 పరుగులు, మలాన్ 27 బంతు ల్లో 15 పరుగులు చేశారంటే వారి పరిస్థితి అర్ధమవుతుంది.
నవ్వుకుంటూ డగౌట్ కి వెళ్లిన భారత్ 100 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగారు. కెప్టెన్ ధవన్, శుభమన్ గిల్ ఇన్నింగ్స్ ఆరం భించారు. భారత్ మొదటి 5 ఓవర్లకే వికెట్ నస్టపోకుండా 35 పరుగులు చేశారు. గిల్ 20 బంతుల్లో 24 రుగులు చేశాడు. ఆరో ఓవర్లో ధవన్ రనౌట్ అయ్యాడు. అతను కేవలం 8 పరుగులే చేశౄడు. భారత్ పదో ఓవర్‌కి 1 వికెట్ నస్టపోయి 53 పరుగులు చేసింది. రెండో మ్యాచ్‌లో ఇరగదీసిన ఇషాన్ కేవలం 18 బంతుల్లో 10 పరుగులే చేసి వెనుదిరిగి అభిమానులను నిరాశపరిచాడు. చిన్న స్కోర్ అయినా ఇలా అవుటవడం ప్రేక్షకులు కొంత ఆగ్రహానికీ గురయ్యారు. లక్నో మ్యాచ్ హీరో శ్రేయస్ అయ్యర్ గిల్ తో కలిసి వీరబాదుడు ఆరంభించాడు. దాంతో 15 ఓవర్లకు భారత్ 77 పరగులకు చేరుకుంది. 16వ ఓవర్‌కు 85, 18.2కి 97 రుగులు చేసింది. ఇక్కడే గిల్ పెవిలియన్ దారి పట్టాడు. అప్పటిదాకా అద్భుతంగా ఆడి 49 పరుగుల చేశాడు. తర్వాత శాంసన్, శ్రేయాస్ లు ఇన్నింగ్స్ మ్యాచ్ ముగించేశారు. శ్రేయస్ 23 బంతుల్లో 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో భారత్ సిరీస్ గెలిచి నట్ట యింది. ఈ ఘన విజయంతో భారత్ బౌలర్లు సెలక్టర్లను బాగా ఆకట్టుకున్నారు.