కేటీఆర్ సవాల్ వెనుక అసలు కారణం అదా..?
posted on Jan 12, 2016 @ 10:27AM
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో రాజకీయ నేతలు సవాళ్లు విసురుకోవడం సహజమే. అయితే అది గెలుపు పక్కా తమదని తెలిసిన నేతలు.. కచ్చితంగా గెలుస్తామనే భరోసా ఉన్నవాళ్లు చేస్తారు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా అలాంటి సవాళ్లే చేసి ప్రతిపక్షాలకు చెమట్లు పట్టిస్తున్నారు. తాజాగా కేటీఆర్ తాము గ్రేటర్ ఎన్నికల్లో ఓడిపోతే తాను మంత్రి పదవి నుండి తప్పుకుంటానని.. ఒకవేళ ప్రతిపక్షాలు కనుక ఓడిపోతే తమ పదవులకు రాజీనామా చేస్తారా అని బహిరంగంగా సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ప్రతిపక్షాలు కేటీఆర్ సవాల్ పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
అయితే అసలు కేటీఆర్ సవాల్ విసరడం వెనుక మాత్రం వేరే కారణాలు ఉన్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గ్రేటర్లో కచ్చితంగా తాము గెలుస్తామన్న ధీమా కేటీఆర్ విసిరిన సవాల్ కు ఒక కారణం కాగా.. మరొకటి ప్రతిపక్షాల స్థయిర్యాన్ని మానసికంగా దెబ్బతీసే సరికొత్త రాజకీయ క్రీడ అని భావిస్తున్నారు. అంతేకాదు తన సవాల్ ద్వారా గెలుపు విషయంలో ప్రతిపక్షాలను డిఫెన్స్ లో పడేసినట్లు అవుతుందని.. రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు కేటీఆర్ సవాల్ కు టీడీపీ స్పందించిది.. కానీ కాంగ్రెస్.. బీజేపీలు స్పందించలేదు. గ్రేటర్ ఎమ్మెల్యే ల గెలుపు కాకుండా..పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలవాలని కోరింది. మొత్తానికి కేటీఆర్ బాగానే రివర్స్ గేమ్ ఆడుతున్నారు.. మరి కేటీఆర్ చెప్పినట్టు గెలుపు ఎవరిది అవుతుందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.