కొల్లం ప్రమాదంపై అనుమానాలు.. మూడు కార్లనిండా బాంబులు..
posted on Apr 11, 2016 @ 4:11PM
కేరళలోని కొల్లం.. పుట్టంగళ్ ఆలయం సమీపంలో బాణసంచా పేలుస్తుండగా ప్రమాదం జరిగి 100 మందికి పైగా ప్రాణాలు పోగా.. 400 మందికి పైగా గాయాలైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ప్రమాదంపై కొత్త ట్విస్ట్ వచ్చి పడింది. అదేంటంటే.. ఆలయం సమీపంలో పేలుడు పదార్థాలతో నిండిన మూడు కార్లును పోలీసులు గుర్తించారు. దీంతో ఈ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరిగినదగ్గరనుండి కార్లు అక్కడే ఉండటం గమనించిన పోలీసులు తనిఖీలు చేయగా.. కార్ల నిండా బాంబులు.. పేలుడు పదార్ధాలు ఉన్నాయి. దీంతో పోలీసులు వెంటనే బాంబు స్క్వాడ్ కు సమాచారం అందించగా వారు బాంబులను నిర్వీర్యం చేసే పనిలో పడ్డారు. మరోవైపు ఈప్రమాదం సహజంగా జరిగిందా.. లేక దీని వెనుక ఎవరి హస్తమైనా ఉందా అనే అనుమానాలు తలెత్తున్నాయి. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.