అరాచక కుల ఉన్మాదంపై పోరాడిన పల్నాటి పులి డాక్టర్ కోడెల!
posted on May 2, 2020 @ 10:33AM
పల్నాడు ప్రాంతంలో ఈ రోజు కనిపిస్తున్న ఒక కుల ఉన్మాదం, నీచత్వం, తక్కిన్న కులాల మీద దాష్టీకం చేసి ఆధిపత్యం సాధించి గత కాలపు అరాచకాన్ని వెట్టి ని ఆ చీకటి రోజులని గుర్తు చేస్తూ ఆ చీకటి ని మళ్లీ తీసుకు రావాలని చెలరేగి పోతున్న వున్మాధులని చూస్తే కోడెల ఎంత పోరాటం చేశారో, ఆయన పై ఎందుకు ఆ స్థాయి లో దాడి జరిగిందో అర్థం అవుతుంది.
గమనించి చూస్తే 3 రాష్ట్రాల్లో ఎక్కడా లేని ఒక కుల ఉన్మాదం ఈ పల్నాడు ప్రాంతం లో ఒక పెత్తందారీ కులం లో కనబడుతుంది. ఎంతలా అంటే 30 యేళ్లు రాష్ట్రాన్ని ఏలిన రాయలసీమ, తెలంగాణ ప్రాంత సాటి కులస్తులని కూడా 8 యేళ్లు మాత్రం ఈ ప్రాంత కులస్తులు డైరెక్షన్ చేసి నడిపించే అంత. వీళ్ళ మసి వాళ్ళకి పూసే తెలివి తేటలు పుష్కలం వీరిలో.
40 యేళ్లు ఒక బక్క పల్చటి ఐదున్నర అడుగుల డాక్టర్ సింహ స్వప్నం లా నిల్చున్నాడు. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరిన కోడెల 1983 నుంచి 2004 వరకు వరసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి గెలిచాడు. ఆ తర్వాత రెండుసార్లు ఓటమిపాలైనా, 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సత్తెనపల్లి నుంచి టీడీపీ తరపున గెలుపొందాడు. శాసనసభకు ఆరుసార్లు ఎన్నికైన డాక్టర్ కోడెల ఎన్.టి.ఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో పలు శాఖల్లో పనిచేశారు.
తిరుగులేని సర్జన్ గా కీర్తిగడించిన డాక్టర్ కోడెలపై అనాడు ఎన్టీఆర్ దృష్టి పడింది. దీంతో ఆయన్ను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్‌టిఆర్ పిలుపుమేరకు 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో చేరి మొదటిసారిగా నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. ఒకవైపు ఎమ్మెల్యేగా పనుల వత్తిడిలో ఉంటూనే.. మరోవైపు ప్రజలకు వైద్యసేవలు అందించేవారు. డాక్టర్ కోడెల అప్పటి ఎన్నికల్లో నర్సరావుపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి వరుస విజయాలు నమోదు చేశారు డాక్టర్ కోడెల. 2004, 2009 ఎన్నికల సమయంలో టీడీపీ అధికారానికి దూరమైనప్పుడు వరుస పరాజయాలు చవిచూశాడు.
రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన తొలి ఎన్నికల్లో సొంత నియోజకవర్గం నరసరావుపేటను వదిలి సత్తెనపల్లి నుంచి డాక్టర్ కోడెల విజయం సాదించారు.
రాజకీయ వ్యూహాలు రచిస్తూ, రాష్ట్ర రాజకీయాలలో తనదైన ముద్రవేశారు. శాసనసభాపతిగా, నియోజకవర్గ ఎమ్మెల్యేగా, వివిధ మంత్రుత్వ శాఖల పదవులకు వన్నె తెచ్చిన నాయకుడు. కోడెల రాజకీయంగానే కాక, అనేక సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తూ, సమాజానికి తనదైన సేవలు అందించారు. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా, వేడుకలు జరుపుకోకుండా, ఎదో ఒక సామాజిక సేవ చేసే వారు.