వణికి చస్తున్న కొడాలి నాని!
posted on Jun 15, 2024 @ 10:30PM
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వున్న వైసీపీ నాయకులు ఒక అపోహలో మునిగిపోయి వణికిపోతున్నారు. మేం అధికారంలో వుండగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని చిత్రహింసలకి గురిచేశాం. నోటికి వచ్చినట్టు తిట్టాం. మర్డర్లు కూడా చేశాం. మళ్ళీ మా పార్టీయే అధికారంలోకి వస్తుందనే భ్రమల్లో బతికి ఇష్టమొచ్చినట్టు వాగి చచ్చాం. ఇప్పుడేమో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మా పరిస్థితి ఏమవుతుందో... మా జీవితాలు ఏమవుతాయో అని గడగడలాడుతున్నారు. ప్రభుత్వం వైపు నుంచి ఎప్పుడు ఏ నిర్ణయం వెలువడుతుందో, తమ పరిస్థితి ఖేల్ ఖతమ్ దుకాణ్ బంద్ అవుతుందో అని భయపడుతున్నారు. అసలు ఉన్న సిట్యుయేషన్ కంటే, వీళ్ళ భయం కొన్ని వందల రెట్లు ఎక్కువగా వుంది. వైసీపీ వాళ్ళుగానీ, వైసీపీ ప్రభుత్వం గానీ ప్రవర్తించినట్టుగా విచ్చలవిడిగా తెలుగుదేశం నాయకులుగానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ ప్రవర్తించదు. ఏదైనా చట్ట ప్రకారమే వెళ్తుంది. వేధింపులు, కక్ష సాధింపులు, దాడులు, దూషణలు వుండవని, అలాంటి వాటిని తాను క్షమించనని తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ప్రకటించారు కూడా. అయినప్పటికీ వైసీపీ నాయకులు అల్లాడిపోతున్నారు. అలాంటి వారిలో ఫస్టు వరుసలో వున్న వ్యక్తి కొడాలి నాని.
ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు నుంచే ఆరోగ్యం అంతంత మాత్రంగా వున్న కొడాలి నాని, ఎన్నికల ఫలితాల తర్వాత ఒకసారి మీడియా ముందుకు వచ్చి ‘‘కాపాడండయ్యా నన్ను’’ అన్నట్టుగా బేలగా మాట్లాడి వెళ్ళిపోయాడు. ఒకరోజు జగన్ దగ్గరకి వెళ్ళి చేతులు కట్టుకుని నిల్చున్నాడు. ఆ తర్వాత మనిషి ఇల్లు దాటి బయటకి రావడం లేదు. ఆయన అనుచరులే అప్పుడప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించి వస్తున్నారు. కొడాలి నాని మానసికంగా బాగా క్రుంగిపోయినట్టు తెలుస్తోంది. టెన్షన్‌తో భయపడిపోతున్నట్టు తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం తన దగ్గరకి వెళ్ళిన కొంతమంది పార్టీ నాయకులతో కొడాలి నాని, చాలా విరక్తిగా మాట్లాడారని సమాచారం. కూటమి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు తనకు ఎలాంటి థ్రెట్ వున్నట్టు తెలియకపోయినప్పటికీ, విపరీతమైన ఆందోళనకు గురవుతున్నానని చెప్పాడట. ఏ నిమిషంలో ఏ కేసు మీద పోలీసులు తన ఇంటి తలుపు తడతారో, ఏ నిమిషంలో ఇంటి మీదకి ఎవరు దాడి చేస్తారో అని భయంగా అనిపిస్తోందని చెప్పుకున్నాడట. ఈ టెన్షన్ తాను భరించలేకపోతున్నానని, చచ్చిపోతే ఏ గొడవా వుండదని అన్నాడట.
కొడాలి నాని నోటి వెంట ‘చచ్చిపోతే’ అనే మాట వచ్చేసరికి ఆయన అనుచరులు ఒక్కసారిగా షాకైపోయారట. నువ్వలా మాట్లాడకన్నా, మాకు ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా మాట్లాడితే, ఇక మా పరిస్థితి ఏమిటని బాధపడ్డారట. దాంతో కొడాలి నాని ఏదో మాటవరసకి అన్నాలే.. చావడమంటే అంత ఈజీనా అని వాళ్ళని శాంతపరిచాడట. తన అనుచరులను అయితే కొడాలి నాని శాంతపరిచాడుగానీ, తాను మాత్రం అశాంతిలో మునిగితేలుతున్నట్టు సమాచారం.