ఎన్టీఆర్ తో మాకేం సంబంధం.. కొడాలి నాని హాట్ కామెంట్స్
posted on Nov 25, 2021 @ 1:32PM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జూనియర్ ఎన్టీఆర్ సెంటర్ గా హాట్ హాట్ గా సాగుతున్నాయి. అసెంబ్లీలో చంద్రబాబు ఫ్యామిలీ టార్గెట్ గా వైసీపీ నేతలు కామెంట్లు, చంద్రబాబు ఏడుపు అంశాలపై జూనియర్ స్పందనపై టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఎన్టీఆర్ తీరు సరిగా లేదంటూ ఓపెన్ గానే వ్యాఖ్యానించారు టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. మరికొందరు నేతలు కూడా తన మేనత్తకు అవమానం జరిగినా ఎన్టీఆర్ సరిగా స్పందించలేదని అన్నారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వంశీ తన మిత్రులు కావడం వల్లే ఎన్టీఆర్ వైసీపీని టార్గెట్ చేయలేదనే విమర్శలు టీడీపీ నేతల నుంచి వచ్చాయి.
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాట్లాడారు మంత్రి కొడాలి నాని. జూనియర్ ఎన్టీఆర్‌కు తమకు సంబంధం ఏమిటి? అని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘ఒకప్పుడు కలిసి ఉండొచ్చు. ఇప్పుడు విడిపోయాం. ఆయన చెబితే మేమెందుకు వింటాం? ఇప్పుడు నేను, వంశీ జగన్‌తో ఉన్నాం. ఆయన కోసం పని చేస్తున్నాం’’ అని కొడాలి నాని వెల్లడించారు
జగన్‌పై చిరంజీవి తిరుగుబాటు!.. టికెట్ ధరలపై తెగింపు!
ఎన్టీఆర్ కుటుంబం మద్దతు కోసం చంద్రబాబు ఆయన భార్యను రోడ్డు మీదకు లాగారని కొడాలి అన్నారు. గొర్రె కసాయిని నమ్మినట్లు నందమూరి కుటుంబం చంద్రబాబును నమ్ముతూనే ఉందని కొడాలి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కుటుంబం మాటలు చూస్తే తనకు జాలేసిందని కొడాలి ఎద్దేవా చేశారు. జగన్‌ను వేధించిన సోనియా నుంచి ఎర్రన్నాయుడు, శంకర్రావు, లోకేష్ పరిస్థితి ఏంటో అందరూ చూశారని చెప్పారు. చంద్రబాబుకు తానెందుకు క్షమాపణ చెప్పాలని కొడాలి నాని ప్రశ్నించారు.