జగన్‌కి కేతిరెడ్డి బైబై!
posted on Jul 4, 2024 @ 11:27AM
జగన్ పార్టీకి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గుడ్‌బై కొట్టబోతున్నట్టు సమాచారం. జగన్ చేసిన దుర్మార్గపు పాలన కారణంగా మొన్నటి ఎన్నికలలో గెలవాల్సిన వాళ్ళు కూడా ఓడిపోయారు. వాళ్ళలో కేతిరెడ్డి కూడా ఒకరనే అభిప్రాయాలు వున్నాయి. ఎమ్మెల్యే పదవి చేపట్టినప్పటి నుంచి గుడ్మాణింగ్ ధర్మవరం అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల దగ్గరకి వెళ్తూ వుండేవారు. ఆయన మీద వచ్చిన అవినీతి ఆరోపణల గురించి అలా వుంచితే, కేతిరెడ్డి అంత ఈజీగా ఓడిపోయే నాయకుడు కాదన్న అభిప్రాయాలైతే వున్నాయి. ఓడిపోయినప్పటి నుంచి తీవ్రమైన డిప్రెషన్లో పడిపోయిన కేతిరెడ్డి ఇప్పుడిప్పుడే బయటకి వస్తున్నారు. ఇక జగన్‌తో వుంటే తనకు రాజకీయ భవిష్యత్తే వుండదని అర్థం చేసుకున్న ఆయన త్వరలో జంపింగ్ జపాంగ్ మంత్రం పఠించబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన చేరబోయే పార్టీ తెలుగుదేశం మాత్రం కాదు.. ఎందుకంటే, వైసీపీ నాయకులకెవరికీ టీడీపీలోకి నో ఎంట్రీ!