కేసీఆర్‌కి పెళ్ళికార్డు ఇచ్చిన జయప్రద
posted on Feb 21, 2015 @ 4:12PM
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును సినీనటి జయప్రద శనివారం సచివాలయంలో కలిశారు. జయప్రద తన సోదరి కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను కేసీఆర్కు అందచేశారు. వివాహానికి తప్పకుండా రావాలని జయప్రద ఈ సందర్భంగా కేసీఆర్ను ఆహ్వానించారు. ఆ తర్వాత జయప్రద మీడియాతో మాట్లాడుతూ తన సోదరి కుమార్తె పెళ్లికి ఆహ్వానించేందుకే కేసీఆర్ను కలిసినట్లు చెప్పారు. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఏమీ లేదని అన్నారు. జయప్రద కొద్ది రోజుల క్రితం తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావును కలసి తనకు కేసీఆర్ అపాయింట్‌మెంట్ కావాలని కోరిన విషయం తెలిసిందే.