రాసలీలల మంత్రి రాజీనామా..
posted on Mar 3, 2021 @ 2:06PM
ఉద్యోగం పేరుతో ఓ మహిళను లోబరుచుకున్న కర్ణాటక జలవనరులశాఖ మంత్రి, బీజేపీ నేత రమేశ్ జార్కిహొళి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. నిన్న సాయంత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెప్పినప్పటికీ.. పార్టీ అధిష్టానం నుండి వచ్చిన ఒత్తిడి కారణంగా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగం ఇప్పిస్తానని బెంగళూరు ఆర్‌టీ నగర్‌కు చెందిన యువతిని లొంగదీసుకున్న మంత్రి రమేశ్‌జార్కిహొళి ఆమెతో రాసలీలలు జరిపినట్టుగా తెలుపుతున్న ఒక వీడియోను దినేశ్ కల్లహళ్లీ అనే సామాజిక కార్యకర్త బెంగళూరులో మీడియాకు విడుదల చేశారు.
ఈ కేసుపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైందని, మంత్రిపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ కొనసాగుతుందని కర్ణాటక హోమంత్రి బసవరాజ్ బొమ్మై మీడియాకు తెలిపారు. కొద్దిరోజలలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంత్రిగారి శృంగారానికి సంబంధించిన సీడీ బయటకు రావడంతో బీజేపీ చిక్కుల్లో పడింది.
మరోపక్క కర్ణాటకలో బీజేపీ సర్కార్ ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించిన రమేశ్ జార్కిహొళి. అప్పట్లో కాంగ్రెస్, జేడీఎస్ లో ఉన్న అసంతృప్త ఎమ్మెల్యేలను ఒకచోట చేర్చి వారితో సొంత పార్టీలపై తిరుగుబాటు చేయించి వారి శాసన సభ్యత్వాలకు రాజీనామా చేయించిన సమయంలో రమేశ్‌చాల కీలకంగా వ్యవహరించారు. అయన గతంలో కాంగ్రె్‌సలో ప్రముఖ నేత అయినా స్థానిక కాంగ్రెస్ నేతలతో విభేడాలు వచ్చి బీజేపీ కి జై కొట్టారు. ఆ తర్వాత జేడీఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పతనం చేసి బీజేపీ అధికారంలోకి రావడానికి అయన తేరా వెనుక పావులు కదిపారు. అంటువంటి ముఖ్యనేత ఈ సెక్స్ స్కాండల్ లో చిక్కుకోవడం సీఎం యడ్యూరప్పను ఇరకాటంలో పడేసింది. రెండు రోజులలో శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు ఈ అంశాన్ని ఆసరాగా చేసుకుని సర్కార్ పై దాడి చెస్ అవకాశం ఉండడంతో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన మంత్రి తో ముందుగానే రాజీనామా చేయించారని విశ్లేషకులు భావిస్తున్నారు.