కరిష్మా కపూర్‌కి మళ్ళీ పెళ్ళి?
posted on Jun 6, 2014 @ 5:33PM
తెలుగులో హిట్టయిన ‘ప్రేమఖైదీ’ హిందీ సినిమా ద్వారా హీరోయిన్‌గా బాలీవుడ్ తెరమీద మెరిసిన కరిష్మా కపూర్ రాజ్ కపూర్ మనవరాలిగా, రణధీర్ కపూర్ కూతురిగా, కరీనా కపూర్ అక్కగా అందరికీ తెలిసిన అందగత్తే! చాలాకాలం హీరోయిన్‌గా వెలిగిన కరిష్మా ఆ తర్వాత సంజయ్ కపూర్ని పెళ్ళి చేసుకుంది. చాలామంది హీరోయిన్ల తరహాలోనే ఆమెకి కూడా భర్తతో విభేదాలు వచ్చి విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకున్న తర్వాత చాలాకాలానికి కరిష్మాకి ఇప్పుడు మళ్ళీ పెళ్ళి మీద గాలి మళ్ళినట్టు తెలుస్తోంది. సంజయ్ కపూర్ నుంచి విడాకులు రావడానికి సహకరించిన సందీప్ తోష్నివాల్ అనే హాండ్సమ్ గైతో కరీనా ప్రేమలో పడిపోయింది. కొంతకాలంగా వారి ప్రేమాయణం సాగుతోంది. ఇప్పుడు వీరిద్దరూ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
సందీప్ తోష్నీవాల్ ముంబైలోని ఓ హెల్త్ కంపెనీకి సీఈవో. వీళ్ళ పెళ్ళికి ఇద్దరి వైపునుంచి పెద్దలు ఓకే అనేశారని తెలుస్తోంది. త్వరలో వీరిద్దరూ ఎంచక్కా పెళ్లిచేసుకోబోతున్నారు. కరిష్మాకి ఇది రెండో పెళ్ళి. అలాగేని సందీప్ తోష్నివాల్ బాలాకుమారుడని అనుకోకండి. ఈయనగారు కూడా గతంలో తన మొదటి భార్యకు విడాకులిచ్చేశాడు. అన్నట్టుకు కరిష్మాకి ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటో!? ఓకే.. ఏది ఏమైనా వీళ్ళిద్దరి మొదటి పెళ్ళి ఫట్టయింది.. రెండో పెళ్ళయినా హిట్టవ్వాలని ఆశీర్వదిద్దాం. కరీనా పిల్లలకి సందీప్ తోష్నివాల్ నుంచి తండ్రిప్రేమ దొరుకుతుందని ఆశిద్దాం.