జగన్ పై జేసీ ఫైర్.. జగన్ కు అదే పని..
posted on Dec 30, 2015 @ 9:41AM
జేసీ దివాకర్ రెడ్డి.. ఆయన మాట్లాడేవిధానం గురించి అందరికి తెలిసిందే. ఏది మాట్లాడినా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం ఆయన నైజం. ఎవరినైనా తిట్టాడానికి అస్సలు భయపడేతత్వం కాదు దివాకర్ రెడ్డి. అలాంటి జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు ఏకంగా ప్రతిపక్షనేత.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. జగన్ ప్రతిపక్ష నాయకుడిగా విఫలమయ్యాడని విమర్శిస్తూ....ఆయన ఎప్పుడూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తిట్టడమే అని ఎద్దేవా చేశారు. ఎప్పుడూ చంద్రబాబునే విమర్శిస్తూ.. చంద్రబాబు విమర్శించడమే ప్రతిపక్షనేత తన పనిగా ఫీలవుతున్నారని అన్నారు. అంతేకాదు ఎప్పుడూ సీఎం పదవి గురించే ఆలోచించే జగన్ మంచి పనులు చేసి తద్వారా ఆ పదవిని పొందలే కాని ఇలా విమర్శలు చేయడం తగదని విమర్శించారు.
మరోవైపు జగన్ ను తిడుతూనే.. జేసీ చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్నిప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు పాటుపడుతున్నారని.. సీమను సస్యశ్యామలం చేసేందుకు చంద్రబాబు క్రియాశీలంగా అడుగులు వేస్తున్నారని కీర్తించారు. అలాంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ సంతోపడాలి తప్పులు ఏమైనా చేస్తే సర్దిచెప్పాలే తప్ప ఊరికే విమర్శలు చేయవద్దన్నారు.