వైసీపీ పాలనంతా పన్నుల వాత...పథకాల కోత.. చంద్రబాబు
posted on Jun 28, 2022 @ 10:23AM
జగన్ పాలన అంతా పన్నుల వాత, పథకాల కోత చందంగా సాగుతోంది. జగన్ సర్కార్ మూడేళ్ల పాలనలో ప్రజలపై ఒక వైపు పన్నులతో వాతలు పెడుతూ, మరో వైపు సంక్షేపథకాలకు కోతలు పెట్టడంగానే సాగిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు.
ప్రజలకు అందే సంక్షేమ పథకాలకు నిబంధనల చట్రాదలు బిగించి కోతలు పెట్టి వాటిలో కూడా డబ్బులు మిగుల్చు కోవడమే జగన్ సర్కార్ లక్ష్యంగా కనిపిస్తున్నదన్నారు. పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో ఆయన చెత్త నుంచి ప్రతి దానిపై పన్నువిధిస్తూ ప్రజలకు ఆర్థిక వాతలు పెడుతోందని విమర్శించారు. అమ్మ ఒడిపథకంలో 52వేల మంది లబ్ధిదారులను తొలగించడాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
అలాగే ఒంటరి మహిళల పింఛన్ అర్హత వయస్సును 50 ఏళ్లకు పెంచి లక్షలలో లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేశారన్నారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుక కూడాఇవ్వని జగన్ కు ఆ భూములను అమ్మే హక్కు ఎవరిచ్చారన్నారు. మూడేళ్లుగా అమరావతిని నిర్లక్ష్యం చేసి, అభివృద్ధిని నీరు గార్చి.. అప్పట్లో తాను ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలను ఇప్పుడు ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇస్తామంటూ జగన్ సర్కార్ చెప్పడం సిగ్గు చేటన్నారు. డబ్బులు పంచినా, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీలో లేకున్నా ఆత్మకూరు ఉఫ ఎన్నికలో వైసీపీకి ఓట్లు పెరగకపోవడమే జగన్ సర్కార్ పై ప్రజలలో పెల్లుబుకుతున్న తీవ్ర వ్యతిరేకతకు నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు.
తన హయాంలో నాణ్యమైన విద్యను అందించడంలో 3వ స్థానంలో ఉన్న రాష్ట్రం జగన్ మూడేళ్ల పాలనలో 19వ స్థానానికి పడిపోయిందనీ, టెన్త్, ఇంటర్ పరీక్షల్లో ఫెయిలై 19 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారనీ, ఆ పాపం పూర్తిగా జగన్ సర్కార్ దేనని విమర్శించారు. . సొంత బ్రాండ్లతో జగన్ ప్రజల ప్రాణాలు హరిస్తున్నారు. మద్యం నాణ్యతపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దుల్హన్ పథకం కింద పేద ముస్లిం మైనార్టీ యువతులకు టీడీపీ ఇచ్చిన రూ.50 వేల సాయాన్ని రూ.లక్షకు పెంచుతానని హామీ ఇచ్చి జగన్ ఇప్పుడునిధుల్లేక ఆ పథకాన్నే నిలిపివేశామని హైకోర్టులో చెప్పడం ఆయన మోసకారి తనానికి నిలువెత్తు నిదర్శనమని విమర్శించారు. .