శవాల మీద మరమరాలు ఏరుకోబోతున్న జగన్?
posted on Jun 7, 2024 @ 4:36PM
ఓరి నీ జగన్ పార్టీ వాళ్ళ ఏశాలో.. మళ్ళీ మొదలెట్టేశారా? ఈ రాబందు పార్టీ వాళ్ళు మళ్ళీ మొదలెట్టేశారు. జలగన్న చేత మరోసారి ఓదార్పు యాత్ర చేయించడానికి ప్లాన్ చేసేస్తున్నారు. ఆ మహామేత చనిపోయిన సందర్భంగా గుండె ఆగిపోయిన వాళ్ళ కుటుంబాలని జలగన్న ‘ఓదార్పు యాత్ర’ పేరుతో పరామర్శించిన విషయం తెలిసిందే. అలాంటి ఓదార్పు యాత్ర మరోసారి నిర్వహించడానికి గ్రౌండ్ ప్రిపరేషన్ జరుగుతోంది. జగన్ అధికారం కోల్పోయేసరికి రాష్ట్రవ్యాప్తంగా చాలామంది గుండెలు వరసబెట్టి ఆగిపోయి చనిపోతున్నారట. జగన్ ఓడిపోయినట్టు ఫలితాలు వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజూ లేత గుండెలు టపా టపా ఆగిపోయి టపా కట్టేస్తున్నారట. ఈ మేరకు భక్షి పేపర్లో డెడ్ బాడీల ఫొటోలతో సహా రోజూ న్యూస్‌లు కనిపిస్తున్నాయి.
సాధారణంగా రాబందులు ఎక్కడెక్కడ శవాలు దొరుకుతాయా అని వెతుక్కుంటూ వుంటాయి. మన జగన్ పార్టీ వాళ్ళు డిట్టో రాబందుల్లాంటి వాళ్ళే. వాళ్ళు కూడా ప్రస్తుతం శవాల కోసం వెతుక్కుంటున్నారు. ఆంద్రప్రదేశ్‌లో ఎవరు చనిపోయినా, అక్కడ రాబందుల్లా వాలిపోతున్నారు. మీ శవాన్ని మేం వాడుకుంటాం.. అంత్యక్రియల ఖర్చు మొత్తం మేమే భరిస్తాం. కొంత అమౌంట్ కూడా ఇస్తాం. జగనన్న ఓడిపోయినందువల్లే గుండె ఆగి చనిపోయాడని అందరికీ చెప్పండి అని ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఓ పాతిక శవాల వరకు సంపాదించిన జగన్ పార్టీ వర్గాలు.. ఆ శవాల లిస్టు వందో, రెండొందలో అయ్యాక తమ నాయకుడిని రంగంలోకి దింపే ఆలోచనలో వున్నట్టు తెలుస్తోంది. అప్పుడు జగన్ ‘ఓదార్పు యాత్ర-2’ పేరుతో మరోసారి శవాల మీద మరమరాలు ఏరుకునే కార్యక్రమాన్ని మొదలుపెడతారని తెలుస్తోంది.