జగన్ జెండా పీకేస్తున్నారా? కాంగ్రెస్ లో వైసీపీ విలీనమేనా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పార్టీ జెండా పీకేయడానికి రెడీ అయిపోయారా?  వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడం ఇక లాంఛనమేనా? అన్న అనుమానాలు ఇప్పుడు రాజకీయవర్గాలలో గట్టిగా వ్యక్తమౌతున్నాయి. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి రెడీ అయిపోయిన ఆయన ఆ లాంఛనం పూర్తి చేయడానికి తన సోదరి షర్మిల నడిచిన దారిలోనే నడుస్తున్నారన్న చర్చ కూడా బలంగా వినిపిస్తోంది.

పులివెందుల నుంచి ఆయన బేంగళూరు వెళ్లింది కూడా పార్టీ విలీనంపై కాంగ్రస్ సీనియర్ నేత, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో సంప్దింపుల కోసమేనని అంటున్నారు. షర్మిల కూడా తన వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి డీకేనే ఆశ్రయించారు. ఇప్పుడు జగన్ కూడా అదే దారిలో నడుస్తున్నారని అంటున్నారు. అయితే జగన్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ఒక షరతు పెట్టారని అంటున్నారు. ఇంతకీ ఆ షరతు ఏమిటయ్యా అంటే తన సోదరిని కాంగ్రెస్ దూరం పెట్టాలి. తన దారికి ఆమె అడ్డు ఉండకూడదు. ఈ షరతుకు కాంగ్రెస్ అంగీకరిస్తుందా అన్నది పక్కన పెడితే.. జగన్  ఇంకెంత మాత్రం వైసీపీని కొనసాగించే    ఉద్దేశం లేదన్నది మాత్రం స్పష్టమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం,  అటు కేంద్రంలో కూడా తెలుగుదేశం పార్టీ కీలక పాత్రపోషిస్తుండటంతో బలమైన జాతీయ పార్టీ అండ లేకుండా మనుగడ కష్టమన్న భావనకు జగన్ వచ్చారని అంటున్నారు. దీంతో ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అంటున్నారు. తనపైన సిబిఐ, ఈడీ కేసులతో పాటు, బాబాయ్ మర్డర్ కేసు కూడా వేలాడుతూ ఉండటంతో జాతీయ పార్టీ సాయం లేనిదే బ్రతికి బట్టకట్టటం కష్టమని భావించిన  జగన్  వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలన్న నిర్ణయానికి వచ్చారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. 

ఇందుకు బెంగుళూరు వేదికగా జగన్ చర్చలు జరుపుతున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, డీకే శివకుమార్ తో  బుధవారం రాత్రి భేటీ అయిన జగన్, కాంగ్రెస్ నుంచి షర్మిలని పక్కన పెడితే, తాను వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని ఆఫర్ ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఇందుకు డీకే నుంచి ఎటువంటి సానుకూలతారాలేదనీ, హైకమాండ్ తో చర్చిస్తానని మాత్రమే అన్నారని తెలుస్తోంది.   

ఇక ఈ విషయంలో జగన్ కు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు అంతంతమాత్రమేనని కూడా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ పార్టీని విలీనం చేసుకుంటే జగన్ పాపాలు కాంగ్రెస్ కు కూడా అంటుతాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారంటున్నారు.  

Teluguone gnews banner