ప్రతిపక్ష హోదా..జగన్ పిటిషన్ విచారణ వాయిదా
posted on Sep 24, 2025 @ 2:01PM
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా హోదా ఇవ్వడం సాధ్యం కాదంటూ స్పీకర్ ఇచ్చిన రూలింగ్ ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించన సంగతి తెలిసిందే. జగన్ పిటిషన్ బుధవారం (సెప్టెంబర్ 24) విచారణకు వచ్చింది. అయితే విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. జగన్ తన పిటిషన్ లో తనను ప్రతిపక్షనేత హోదా కల్పించేలా ఏపీ శాసన వ్యవహారాల కార్యదర్శి, అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని కోరారు. శాసన సభ కార్యదర్శి, న్యాయశాఖ ముఖ్యకార్యదర్శి, స్పీకర్ కార్యదర్శి, వ్యక్తిగత హోదాలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌లను ప్రతివాదులుగా చేర్చారు.
ఈ పిటిషన్ విచారణను హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ సందర్భంగా తన పిటిషన్ లో జగన్ ప్రతివాదులుగా పేర్కొన్న స్పీకర్ , అసెంబ్లీ సెక్రటరీ, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మత్రి పయ్యావుల కేశవ్ లకు నోటీసులు ఆచ్చింది. ఆ నోటీసులలో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు పేర్కొంది. జగన్ రెడ్డి ఇంతకు ముందు కూడా ఇలాంటి పిటిషన్ దాఖలు చేశారు. అది పెండింగ్ లో ఉండగానే మళ్లీ మరో పిటిషన్ వేశారు. మామూలుగా అసెంబ్లీ వ్యవహారాలలో కోర్టులు జోక్యం చేసుకోవు. స్పీకర్ నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే తప్ప ఎటువంటి ఆదేశాలూ ఇచ్చే పరిస్థితి ఉండదు. ప్రతిపక్ష నేత హోదా అంశంలో గతంలో పదిశాతం సీట్లు లేకుండా హోదా కావాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ల పై అనుకూలమైన తీర్పులు వచ్చిన దాఖలాలు లేవు.