గెలిపించండి మంత్రిపదవిస్తా.. జగన్ తాయిలాల ప్రకటన!
posted on Sep 3, 2022 @ 4:02PM
ఎవరు హోంవర్క్ త్వరగా పూర్తి చేస్తే వారికి చాక్లెట్ అంటూ తల్లి, ఎవరు పరీక్ష బాగా రాస్తే వారికి పుస్త కాలు ఫ్రీ అని హెడ్‌మాస్టరు, ఎవరు బాగా ఆడితే వాళ్లే కెప్టెన్ అని ఆటల్లో పిల్లలకి తాయిలాలు ప్రకటించి వారిని ఊరించడం చూస్తూనే ఉంటాం. రాజకీయాల్లోకి ఇది వచ్చేసిందని ఏపీ సీఎం జగన్ ద్వారా తెలి సింది. ఎవరు గెలిస్తే వారికి, ఎవరిని గెలిపిస్తే ఆ విజేతకీ మంత్రిపదవి ఇస్తానని జగన్ తాయిలాల ప్రచా రం మొదలెట్టారు.
రాజకీయాల్లో సహజసిద్ధంగా ఎదగాల్సి ఉంటుంది. ఎన్నికల్లో గెలవాలంటే ఆయా ప్రాంతాల్లో వారికి కాస్తం త మంచిపేరు ఉండాలి, మంచి ఫాలోయింగ్ అవసరం. అలాంటివారికి ఎలాగూ పెద్దగా ప్రచారం అవస రం లేదు. కానీ ప్రత్యర్ధిని అనుసరించి ప్రచారం గట్టిగానే చేయాల్సివస్తుంది. కానీ గెలవడానికి అభ్యర్ధి లేదా అభ్యర్ధిని గెలిపించి మహా వీరాభిమానులు కాళ్లు చేతులు విరిగేలా పనిచేసుకుని మెజారిటీ సాధిం చాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి తోడు జగన్ కొత్తగా తాయిలాల పద్దతి ఆరంభించారాయె. కనుక ఇపుడు గెలిచి తీరాలి. గెలిస్తే బతిమాలకుండానే ఆయన మంత్రిపదవి ఇస్తానని హామీ కూడా ఇచ్చేశారు. అంటే ఇలా పార్టీని మంచి మెజారిటీతో నిలబెట్టడానికి వ్యూహం అయినప్పటికీ అది ఆ అభ్యర్ధికి ఏ మేరకు నిజం గానే ఉపయోగపడుతుందనేది తర్వాత చూడాలి. నానా అవస్థాపడి గెలిచాక జగనన్న కాస్తా మొండిచేయి చూపితే పడిన కష్టంతో ఒళ్లుపులిసి, కాసులు పోయి ఇంటికి పరిమితం కావాల్సి వస్తుంది.
రాష్ట్ర మంత్రివర్గంలో గరిష్ఠంగా 25 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది! కానీ... వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే నువ్వే మంత్రి. గెలిపిస్తే మీ నాయకుడికి మంత్రి పదవి ఇస్తా నం టూ నేతలను, కార్యకర్తలను ఊరిస్తున్నారు. ఒకరూ ఇద్దరూ కాదు... పార్టీ బలహీనంగా ఉన్నచోట, గెలు పు సందేహాస్పదంగా ఉన్నచోటల్లా ‘గెలిస్తే మంత్రి పదవి నీకే’ అని మాట ఇస్తున్నారు. ఎన్నికల వ్యూహం లో భాగంగా గడప గడపకూ మన ప్రభుత్వం వర్క్‌షాపులు, నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమా వేశాలు నిర్వహిస్తున్నారు. మీ నాయకుడిని గెలిపించుకుని రండి. మంత్రిని చేస్తా అంటూ నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో కార్యకర్తలకు చెబుతున్నారు. అసలే గడపగడపకు కార్యక్రమంతో అవమానాలు ఎదుర్కొ న్నవారు ఇపుడు ఎన్నికల్లో గెలిచేందుకు మళ్లీ ఇంటింటికీ వెళ్లి మొహం చూపడం కష్టమే. మరి జగనన్న ఆశపెట్టారు గనుక అవమానాలు, తిట్లూ ఒక లెక్కా అనుకుంటే అలాగే ముందుకు సాగిపోతారు, తిట్లకంటే, అవమానాలకంటే మంత్రిపదవి అత్యుత్తమం అన్నది రాజకీయప్రభోద కదా.
ఉదాహరణకు కుప్పంలో భరత్‌ను గెలిపించుకు రావాలని, ఆయనను మంత్రిని చేస్తానని చెప్పారు. రాజాంలో కంబాల జోగులును గెలిపించుకుని వస్తే ఆయనకూ మంత్రి పదవి ఇస్తానని తెలిపారు. మీ నాయకుడిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని జగన్ చెప్పడం ప్రసార మాధ్యమాల్లోనూ రావడం పరిపాటిగా మారింది.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకుండా మరో 25 మందికి మాత్రమే మంత్రులయ్యే వీలుందని .. ముఖ్యమంత్రి జగన్ ఇస్తున్న హామీలు చూస్తుంటే.. ఆ సంఖ్య దాటేస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు. కేవలం ఎన్నికల్లో గెలిచేందుకు. ఎంతకైనా తెగించేందుకే ఇలాంటి హామీలు ఇస్తున్నట్లు భావిస్తున్నారు. జగన్ మంత్రి పదవి హామీ ఇచ్చిన తర్వాతే కుప్పంలో చంద్రబాబును భరత్ వర్గం అడ్డుకునే ప్రయ త్నం చేసిందని రాజకీయవర్గాలు పేర్కొంటు న్నాయి.
గత ఎన్నికల సమయంలోనూ...ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి పదవుల ఆశ చూపి... చివరికి చెయ్యివడం జగన్‌కు కొత్తేమీ కాదని గత అనుభవాలు చెబుతున్నాయని వైసీపీ నేతలే పేర్కొంటున్నారు. 2019 ఎన్ని కల ముందు కూడా ఇలాంటి హామీలు అనేక మందికి ఇచ్చారని చెబుతున్నారు. గుంటూరు జిల్లాలో ఎమ్మె ల్యే సీటును ఆశించిన మర్రి రాజశేఖర్‌ను ఎమ్మెల్సీ చేసి, మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీలు గుప్పిం చారు. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లయింది. మంత్రిపదవి పక్కనపెడితే మర్రి రాజశేఖర్‌కు ఎమ్మె ల్సీ కూడా దక్కలేదు.
తాజాగా 2023లో మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇలా పలు జిల్లాల్లో ఎమ్మెల్యే సీటు కోసం పోటీ పడేవారికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తానంటూ ఇచ్చిన హామీలు నెరవేరలేదు. మరి ఈ నేప థ్యంలో నాయకుని హామీకి తలొగ్గి వైసీపీ నేతలు ఏమాత్రం ఉత్సాహపడతారో చూడాలి.