జనం సొమ్ముతో జగనన్న విలాసాలు
posted on Jul 1, 2022 @ 9:08PM
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సతీసమేతంగా ప్యారిస్ వెళ్లారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగత పర్యటన. జగన్ రెడ్డి దంపతుల పెద్ద కుమార్తె హర్ష ప్యారిస్ లోని అత్య్తంత ప్రతిష్టాత్మక ఇన్ సీడ్ బిజినెస్ స్కూల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంబీఎ) పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో పాల్గొనేందుకు జగన్ రెడ్డి సతీ సమేతంగా ప్యారిస్ వెళ్లారు. ముఖ్యమంత్రి అయినా ఒక బిడ్డకు తండ్రిగా, కుమార్తె పట్టా పుచ్చుకునే వేడుకను చూడాలనుకోవడంలో తప్పు లేదు. అయితే, ఈ నాలుగు రోజుల వ్యక్క్టిగత పర్యటనకు ప్రజల సొమ్ము ఖర్చు చేయడం, ఎంతవరకు సమంజసం అనేదే ఇప్పడు అందరి ముందున్న ప్రశ్న.
ప్యారిస్ ప్రయాణం. అదికూడా మాములు ఫ్లైట్ లో కాదు లగ్జరీ ఫ్లైట్ లో ప్రయాణం.
విమాన ఖర్చులే రానూ పోనూ రూ. 10 కోట్ల వరకు ఉంటాయని అంటున్నారు. రూ. 10 కొట్లంటే, కుబేర సంతతికి పెద్ద మొత్తం కాకపోవచ్చును. కానీ, పైసలు లేక అప్పులు అయినా పుట్టే పరిస్థితి లేక సంక్షేమ పథకాలకు కోతలు ప్రభుత్వం ముఖ్యమంత్రి వ్యక్తిగత పర్యటనకు, రూ. 10 కోట్లు ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసం? ఇదే ప్రశ్న చుట్టూ ఏపీ ప్రజానీకంలో జోరుగా చర్చ జరుగుతోంది.
నిజమే, ఇప్పడు, వ్యక్తిగత పనులకు ప్రభుత్వ వాహనాన్ని కూడా ఉపుయోగించని, దివంగత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి వంటి నేతల నిజాయతీని, నేటి తరం నాయకుల నుంచి ఆశించలేము.
ఇక, అక్రమాస్తుల కేసుల్లో ఎ-1 నిందితుడుగా ఉన్న జగన్ రెడ్డి వంటి ‘నీతి’ పరుల నుంచి అయితే అసలే ఆశించలేము. కానీ, ఇలా కొట్లలో ప్రజ ధనాన్ని వ్యక్తిగత విలాసాలకు ఖర్చు చేయడం తప్పు మాత్రమే కాదు, ప్రజాకోర్టులో శిక్షార్హమైన నేరం కూడా అవుతుందని. సామాజిక కార్యకర్తలు ఆక్షేపిస్తున్నారు. సర్కార్ ఖజానాలో పైసలు లేవని ‘దుల్హన్’ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిలిపి వేస్తుంది. పేద విధ్యార్దులకు ఇస్తామన్న లాప్టాప్’ల ధర పెరిగిందని, వాటికీ మంగళ పాడేస్తారు.. ఇలా చెప్పుకుంటూ పొతే జగన్ రెడ్డి సర్కార్ కోతలు పెట్టుకుంటూ పోతున్న పథకాల సంఖ్య పదుల్లో తేలుతుంది.
ఈ నేపధ్యంలోనే, ముఖ్యమంత్రి ఫ్యామిలీ వ్యక్తిగత విదేశీ పర్యటనలకు ప్రజల సొమ్ము ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసం. నిజానికి, ముఖ్యమంత్రి వ్యక్తిగత పర్యటనలకు ప్రజ ధనాన్ని ఉపయోగించరు. కానీ సీఎం జగన్ తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. విదేశీ పర్యటనలకే కాదు, ఇతరత్రా అనేక ఖర్చులు కూడా ఖజానాలో కలిపేస్తున్నారు అనే ఆరోపణలున్నాయి అందుకే జగన్ వ్యక్తిగత పర్యటనలకు కూడా ప్రజాధనమే వాడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే, జగన్ రెడ్డి ప్రభుత్వం విమర్శలు వింటుందని ఆశించడం అవివేకమే అవుతుందని, ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. అయితే ఏదో రోజున, పబ్లిక్ మ్యూజిక్ వినక తప్పదని, ఏపీ విషయంలో అది మరింత ఖాయంగా కనిపిస్తోంది విశ్లేషకులు అంటున్నారు.