జగన్ మోహన్ రెడ్డి 143 కోట్ల ఆస్తులు జప్తు

 

 

 

జగన్ అక్రమ ఆస్తుల కేసులో 143 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ మెంట్ చేసినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది. గతంలో భారతి సిమెంట్, జనని ఇన్ ఫ్రా కు సంబంధించిన రూ.51 కోట్ల ఆస్తులు అటాచ్ చేశారు. రాంకీ సంస్థకు చెందిన రూ.133 కోట్ల ఆస్తులతో పాటు, ఆ సంస్థ జగతి పబ్లికేషన్స్ లో పెట్టిన రూ.10 కోట్ల ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ కేసులో వేసిన చార్జ్ షీట్ ఆధారంగా ఈ ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ప్రకటించారు.


గతంలో చేసిన ఆస్తుల అటాచ్ మెంట్ చెల్లదని జగన్ తరపు సంస్థలు కోర్టులలో పిటీషన్లు వేశాయి. తాజాగా ఇంత పెద్ద ఎత్తున ఆస్తులు అటాచ్ చేయడం జగన్ కు, ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ విషయం మింగుడు పడని అంశమే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.
 

Teluguone gnews banner