పరిటాల శ్రీరామ్ బెయిలు తీర్పు వాయిదా
posted on Jan 8, 2013 @ 6:05PM
ఆనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన కాంగ్రెస్ నేత కామిరెడ్డిపల్లి సుధాకర్ పై జరిగిన హత్యకుట్రలో పరిటాల రవి కుమారుడయిన పరిటాల శ్రీరాంపై పోలీసులు కేసు నమోదు చేయడంతో అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయేడు. గానీ, అతను తన లాయర్ ద్వారా ఈ నెల 2వ తేదిన ఆనంతపురం కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసాడు. దానిపై విచారణ చేపట్టిన కోర్టు తన తీర్పును రేపటికి అనగా బుధవారానికి వాయిదా వేసింది. పరిటాల శ్రీరామ్ ఈ నెల 7వ తేదిన సింగపూర్ వెళ్ళేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొన్న తరుణంలో పోలీసులు కేసు నమోదు చేయడం, అతను అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది. అతని తల్లి పరిటాల సునీత,మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీయే తమను రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ కుట్ర పన్నినట్లు ఆరోపించారు.