సమంత, సిద్దార్థ్ ల 'జబర్‌దస్త్' స్టోరీ ఇదే
posted on Feb 22, 2013 @ 5:44PM
'అలా మొదలైంది' చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన నందిని రెడ్డి, టాలీవుడ్ లక్కీ గర్ల్ సమంత, లవర్ బాయ్ సిద్దార్థ్ వీరి కాంబినేషన్లో సినిమా వస్తోంది అంటే అంచనాలు భారీగా ఉంటాయి. మొదటి సినిమాతో మ్యాజిక్ క్రియేట్ చేసిన నందిని నుంచి రెండో సినిమాలో కూడా సమ్ థింగ్ స్పెషల్ ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. వీరికి తోడు అన్ కా౦ప్రమైజింగ్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తోడవడంతో 'జబర్‌దస్త్' సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ఫస్ట్ రిపోర్ట్ స్టోరీ మీ కోసం:
పెట్టిన ప్రతీ బిజినెస్ ఫెయిల్యూర్ అవుతూ..మరో బిజినెస్ కోసం అప్పులు చేసి జనాల్ని మోసం చేస్తూ బతికే షోకిల్లా రాయుడు బైర్రాజు (సిద్దార్థ్), సొంతంగా బిజినెస్ చేసి పైకి రావాలనుకునే శ్రేయ (సమంత) అనుకోకుండా కలిసి ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఆరంభిస్తారు. కంపెనీ బాగా అభివృద్ధి చెందుతుంది. ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ విడిపోయి వేర్వేరుగా బిజినెస్ చేస్తారు. అలా విడిపోయిన వీరి జీవితాల్లోకి సరస్వతి (నిత్యా మీనన్), ఫేమస్ డాన్ జావేద్ భాయ్ (శ్రీహరి) ఎందుకు వచ్చారు?చివరికి బైర్రాజు, శ్రేయ ఎలా కలిశారన్నది మిగిలిన కథ.