గంగుల నివాసంలో ఈడీ, ఐటీ సోదాలు
posted on Nov 9, 2022 @ 11:55AM
మంత్రి గంగుల నివాసంలో ఐడీ, ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాలలో జరుగుతున్న తనిఖీల్లో భాగంగా మంత్రి నివాసంలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాద్, కరీంనగర్ జిల్లాలలో ఏకకాలంలో ఈ దాడులు జరుగుతున్నాయి.
మంత్రి గంగుల కమలాకర్, అలాగే గ్రనైట్ వ్యాపారుల నివాసాలు, కార్యాలయాలలో ఈ తనిఖీలు సాగుతున్నాయి. హైదరాబాద్ లోని జనప్రియ అపార్ట్ మెంట్, సోమాజి గూడలోని గ్రానైట్ వ్యాపారి నివాసంలోనూ, కరీంనర్ లోని గంగుల కమలాకర్ నివాసం, అలాగే ఆయనకు చెందిన గ్రానైట్ కంపెనీల్లోనూ ఈ సోదాలు జరుగుతున్నాయి.
అలాగే మరి కొందరు గ్రానైట్ వ్యాపారుల నివాసాలు, కార్యాలయాలలో కూడా ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఈ సోదాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఫెమా నిబంధనల ఉల్లంఘనపై గతంలోనే ఈడీ నోటీసులు ఇచ్చినట్లు చెబుతున్నారు. మొత్తం 20 బృందాలు ఈ తనిఖీలలో పాల్గొన్నట్లు చెబుతున్నారు.