Indian priest crucified on Good Friday by ISIS

 

Readers might be aware of a gruesome attack by ISIS on the charity home, run by the Missionaries of Charity in Yemen. Thomas Uzhunnalil, a Christian father from India has been missing from the staff since the day. The external affairs ministry has even confirmed him to be abducted by the ISIS militants. It’s now believed that Thomas has been executed by the ISIS in a gruesome manner.

 

He was thought to have been crucified on the day of Good Friday, depicting the death of Jesus. Though this report has not been confirmed by the Indian government, ISIS is certainly known to involve in such hideous acts. However people working in the Missionaries of Charity at Yemen, were always ready to face such consequences. Even though they were advised to shut down the charity home by the Indian Embassy, they kept helping the needy risking their own lives.

జ‌గ‌న్ స‌ర్వేలో బ‌య‌ట ప‌డ్డ నిజాలేంటి?

  తాజాగా కోటి  సంత‌కాల సేక‌ర‌ణ  చేసింది వైసీపీ. జ‌గ‌న్ పాల‌నికిదో రెఫ‌రెండంగానూ చెప్పుకొస్తున్నారు భూమ‌న‌, రోజా వంటి వైసీపీ  జ‌గ‌జ్జంత్రీలు. ఇదంతా ఇలా ఉంటే  ఈ పైపై మెరుగుల‌కు మోస  పోని... జ‌గ‌న్ లోలోప‌ల ఒక భారీ స‌ర్వే చేయించార‌ట‌. ఈ స‌ర్వేలో 18 నెల‌ల కూట‌మిపాల‌న ఎలా ఉందో ఒక తుల‌నాత్మ‌క ప‌రిశీల‌న చేయించార‌ట‌. ఈ ప‌రిశీల‌న‌లో తేలిన వాస్త‌వాలేంటో చూస్తే..  గ‌తంలో క‌న్నా ఎంతో మెరుగ్గా  కూట‌మి  పాల‌న ఉన్న‌ట్టు చెప్పార‌ట ఈ స‌ర్వేలో పాల్గొన్న ప్ర‌జ‌లు. త‌మ‌కు అన్నీ ప‌థ‌కాలు అందుతున్నాయ‌ని.. ఫించ‌న్లు స్వ‌యంగా బాబే ఇవ్వ‌డం గొప్ప విష‌య‌మ‌నీ.. గూగుల్ వంటి సంస్థ‌లు రావ‌డంతో పాటు.. ఇటీవ‌ల పార్ట‌న‌ర్ స‌మ్మిట్ ద్వారా 13 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర పెట్టుబ‌డుల‌కు సంబంధించిన ఒప్పందాలు జ‌రిగాయ‌ని.. ఇక సంక్షేమ‌ప‌థ‌కాలు కూడా పెద్ద ఎత్తున జ‌నానికి చేరుతున్నాయ‌నీ చెప్పార‌ట‌. మ‌రి  ప‌వ‌న్ క‌ళ్యాణ్ 15 ఏళ్ల పాటు ఈ కూట‌మి క‌లిసి  ఉండాల‌ని కోరుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయ‌మేంట‌ని అడ‌గ్గా.. అలా ఉంటేనే రాజ‌ధానిపూర్త‌వుతుంది. పోల‌వ‌రం కూడా  కంప్లీట్ అవుతుంది. ఆపై కేంద్ర‌ప్ర‌భుత్వంతో ఉన్న  స‌ఖ్య‌త కార‌ణంగా ఇంకా ఎన్నో మంచి ప‌నులు జ‌రుగుతాయి కాబ‌ట్టి.. మాకీ ప్ర‌భుత్వ‌మే బాగుంద‌ని అన్నారట ఆంధ్ర‌ప్ర‌జ‌లు. ఇక చంద్ర‌బాబు అపార‌ అనుభ‌వం, లోకేష్ యువ‌నాయ‌క‌త్వం, ప‌వ‌న్ పాపులారిటీ కూట‌మి ప్ర‌భుత్వానికి పెట్ట‌ని కోట‌లుగా మారి.. ఏపీని సంక్షేమాబివృద్ధి దిశ‌గా  ప‌రుగులు తీయిస్తున్న‌ట్టుగానూ చెప్పుకొచ్చార‌ట స‌ర్వేలో పాల్గొన్న ప్ర‌జ‌లు. దీంతో జ‌గ‌న్ కి దిమ్మ తిరిగి భ‌విష్య‌త్ బొమ్మ క‌నిపించింద‌ట‌. ఆయ‌న అధికార‌పు ఆశ‌ల‌పై ఫ్రిడ్జ్ లోంచి బ‌య‌టకు తీసిన చ‌ల్ల చ‌ల్ల‌ని నీళ్లు కుమ్మ‌రించిన‌ట్ట‌య్యింద‌ట‌. బేసిగ్గా జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కూ ఏం భావించాడో చూస్తే.. ఆయ‌న‌కు ఉన్న 40 శాతం ఓటు బ్యాంకుకు కూట‌మి  వ్య‌తిరేఖ‌త ద్వారా మ‌రో 8 శాతం ఓటు బ్యాంకు త‌న పార్టీకి క‌లిసి  వ‌స్తుంది. కాబ‌ట్టి, సుమారు 50 శాతం ఓట్ల‌తో తాను 2029లో గెల‌వ‌బోతున్న‌ట్టుగా ఫీల‌య్యేవార‌ట ఇన్నాళ్లూ. ఇప్పుడా ఫీలింగ్స్ మొత్తం బూడిద‌లో పోసిన‌ట్టే అయ్యింద‌ట‌. ఆ స‌ర్వే ఫ‌లితాలు అలా అఘోరించాయ‌ట‌. ఇలా ఎందుకు జ‌రిగిందో కూపీ లాగిన  జ‌గ‌న్ కి న‌మ్మ‌లేని నిజాలెన్నో బ‌య‌ట ప‌డ్డాయ‌ట‌. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ మైండ్ సెట్లో ఆల్రెడీ ఉన్న హింసాత్మ‌క ప్ర‌వృత్తికి ర‌ప్పా ర‌ప్పా ఫ్లెక్సీల మోత కూడా తోడ‌య్యింద‌ట‌. అంతే  కాదు కొంద‌రు ఫ్యాను పార్టీ  మ‌ద్ద‌తు దారులు కౌంటింగ్ మొద‌ల‌య్యి ఫ‌లితాలు త‌మ  వైపున‌కు తిరుగుతున్నాయ‌ని తెలిసిన వెంట‌నే న‌*కుడు మొద‌ల‌వుతుంద‌ని చేస్తోన్న హెచ్చ‌రిక‌లు సైతం ఆయ‌న‌కు చేటు తెస్తున్న‌ట్టు బ‌య‌ట ప‌డింద‌ట‌.

కడప నగర మేయర్ గా పాక సురేష్ ఏకగ్రీవం

కడప కార్పొరేషన్ మేయర్ గా వైసీపీ కార్పొరేటర్ పాకా సురేష్ ఏకగ్రీవంగా  ఎన్నికయ్యారు. కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ఎన్నిక ప్రక్రియలో  పాక సురేష్ వినా మరెవరూ పోటీ చేయకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.   గత ఎన్నికల్లో మేయర్ గా గెలిచిన సురేష్ బాబు కుటుంబ సభ్యులు మున్సిపల్ చట్టాలను అతిక్రమించి పనులు చేపట్టారనే‌ కారణంగా కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయగా, ఆ ఫిర్యాదు మేరకు సమగ్ర విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు  నిబంధనలకు విరుద్ధంగా మేయర్ సురేష్ బాబు కుటుంబ సభ్యులు  కాంట్రాక్టులు పొందారని తేలింది. విజిలెన్స్ నివేదికను అనుసరించి సురేష్ బాబును ఈ ఏడాది సెప్టెంబర్ 23న మేయర్ పదవి నుంచి ప్రభుత్వం తొలగించింది. డిప్యూటీ మేయర్ గా ఉన్న ముంతాజ్ బేగంను ఇన్ చార్జి మేయర్ గా నియమించింది.  తాజాగా ఖాళీగా ఉన్న మేయర్ పదవికి జరిగిన ఎన్నికలో వైసీపీ కార్పొరేటర్  పాకా సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  కడప కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్ లు ఉండగా గత ఎన్నికల్లో  టిడిపి నుంచి  ఒక్క కార్పొరేటర్ మాత్రమే గెలుపొందారు. ఒక ఇండిపెండెంట్ గిలిచారు. ఈ రెండూ మినహా మిగిలిన 48 డివిజన్ లలోనూ వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు.  అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం మార డం, కడప ఎమ్మెల్యేగా టిడిపి నుంచి మాధవీ రెడ్డి గెలవడం జరిగింది .ఆ తర్వాత ఎనిమిది మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి తెలుగుదేశంలో  చేరారు. ఇద్దరు వైసీపీ కార్పొరేటర్ లు మరణించారు. దీంతో దీంతో వైసిపి కార్పొరేటర్ల సంఖ్య సంఖ్య 38గా ఉంది. అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా వైసిపి అనుకూలంగా ఉండటంతో వారి సంఖ్య 39 . ఆ కడప కార్పొరేషన్ లో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ  ఉంది.  సంఖ్యా బలం లేకపోవడంతో  గురువారం (డిసెంబర్ 11) జరిగిన మేయర్ ఎన్నికలో తెలుగుదేశం పోటీ చేయలేదు.  వైసీపీ నుండి   47 వ డివిజన్ కార్పొరేటర్ పాక సురేస్ ను మేయర్  అభ్యర్థి పోటీకి దిగి పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా గెలుపొందారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పర్యవేక్షణలో ఎన్నిక ప్రక్రియ జరిగింది.  

రాహుల్ తో రేవంత్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఢిల్లీలో కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ వేదికగా జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ మీట్ వివరాలను రేవంత్ వారికి వివరించారు. ఇంతకీ రేవంత్ ఢిల్లీ ఎందుకు వెళ్లారంటే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జన్మదినం గురువారం(డిసెంబర్ 11). తన 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజకీయ ప్రముఖులను బుధవారం (డిసెంబర్ 10)రాత్రి విందు ఇచ్చారు. ఆ విందుకు తెలంగాణ సీఎం రేవంత్ హాజర్యారు.   ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ కూడా పాల్గొన్నారు.ఈ విందుకు  కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలు కూడా వచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వారిలో కొద్ది సేపు ముచ్చటించారు.  తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విశేషాలు వివరించారు.  

బోరుగడ్డను వైసీపీ వదిలించేసుకుంది!

వైసీపీలో జగన్ వినా మరే నేతకూ చోటు పదిలం కాదు. మనకు పనికిరాడు అనుకుంటే.. ఒక్క క్షణం ఆలోచించకుండా పక్కన పెట్టేస్తుంది. ఈ విషయం వైసీపీలో పలువురు నేతలకు అనుభవమే. తాజాగా ఆ పార్టీ బోరుగడ్డ అనిల్ కుమార్ ను వదిలించేసుకుంది. జగన్ అధికారంలో ఉండగా ఆయన అండ, వైసీపీ దన్ను చూసుకుని మనిషన్న వాడు మాట్లాడకూడని మాటలతో అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం నాయకులను దూషించిన వ్యక్తి బోరుగడ్డ అనిల్. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్, జనసేనాని పవన్ కల్యాణ్ లక్ష్యంగా ఇష్టారీతిగా మాట్లాడిన సంగతి తెలిసిందే. అంతే కాదు జగన్ ఆదేశిస్తే చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని హతమారుస్తానంటూ కూడా బోరుగడ్డ అనిల్ మాట్లాడారు.   గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత.. బోరుగడ్డ అనిల్ కు కష్టాలు మొదలయ్యాయి. కేసులు చుట్టుముట్టాయి. అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడు కూడా.  జైలుకు వెళ్లిన సమయంలోనూ, ఆ తరువాత బయటకు వచ్చి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ కూడా బోరుగడ్డ అనిల్ పదేపదే తనకు జగన్ అండ ఉందని చెప్పుకొచ్చారు.  మాటకు ముందొక జగన్, మాటకు వెనకొక జగన్ అంటూ జగన్ భజన చేసిన బోరుగడ్డ అనిల్ ను సహజంగానే వైసీపీ వ్యక్తే అని అంతా భావించారు. బోరుగడ్డ అనిల్ కూడా అలానే చెప్పుకొచ్చారు. అన్నిటికీ మించి వైసీపీ అధికారంలో ఉండగా,  చంద్రబాబు, లోకేష్, పవన్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మౌనంగా ఉండటం ద్వారా వైసీపీ అతడుమావాడే అనే సంకేతాలు ఇచ్చింది. అయితే అధికారం కోల్పోయిన తరువాత బోరుగడ్డ జైలుకు వెళ్లిన సందర్భంలో వైసీపీకి చెందిన వారెవరూ కూడా బోరుగడ్డను పరామర్శించ లేదు. సరే బోరుగడ్డ జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా తన వైఖరి మార్చుకోలేదు. నేతలపై అనుచిత వ్యాఖ్యలను మానలేదు. అదే సమయంలో తనకు జగన్ అండ ఉందనీ, తాను వైసీపీయుడనేననీ చెప్పుకుంటున్నాడు. అయితే జగన్ మాత్రం ఎవరైనా తనకు బలంగా ఉండాలి కానీ, తన బలం అండగా భావించకూడదు. వివాదాస్పద దర్శకుడు గతంలో తీసిన శివ అనే సినిమాలో విలన్ . ఎవరైనా మనకు బలం కావాలి కానీ మన బలంతో బతకకూడదు అనే డైలాగ్ చెబుతాడు. సరిగ్గా జగన్ తీరు కూడా అంతేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ పదే పదే జగన్ పేరు వల్లిస్తూ, తనకు జగన్ అండ ఉందని చెప్పుకోవడం జగన్ కు, వైసీపీకీ నచ్చలేదు.  దీంతో జగన్ పేరు చెప్పుకుంటూ తిరుగుతున్న బోరుగడ్డ అనల్ ను వైసీపీ వదిలించేసుకుంది.   పార్టీకీ బోరుగడ్డ అనిల్ కు ఏం సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.  బోరుగడ్డ అనిల్ కుమార్ తో వైసీపీకి ఎటువంటి సంబంధం లేదని ప్రకటన విడుదల చేసింది. అతడు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఇటీవల కొన్ని మీడియా ఇంటర్వ్యూల్లోనూ, సోషల్‌ మీడియా వేదికలపై కనిపించడం చెప్పుకోవడాన్ని వైసీపీ ఖండిస్తోందని పేర్కొంది. దీనిపై బోరుగడ్డ ఇంకా స్పందించలేదు. కానీ పరిశీలకులు మాత్రం బోరుగడ్డతో వైసీపీ బంధం ఒక్క ఖండన ప్రకటనతో తీరిపోయేది కాదంటున్నారు. 

ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలేంటంటే?

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ అయ్యింది. సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీ పలు కీలక అంశాలపై చర్చించనుంది. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్రానికి పెట్టుబడులలు అంశంపై కీలక చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. అమరావతికి నాబార్డు నుంచి రూ.7,380.70 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమెదం ఇవ్వనుంది.  అదే విధంగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి    సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్రవేసే అవకాశం ఉంది. దీని ద్వారా  20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, దాదాపు 56 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇంకా పలు,  సంస్థలకు భూ కేటాయింపులపై కూడా కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకుంటుంది.  ఇక పోతే.. 169 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న  లోక్ భవన్ కు టెండర్లు పిలిచుందుకు,  జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటుకు  పాలనా అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.  సీడ్ యాక్సిస్ రహదారిని 16వ నంబర్ జాతీయ రహదారికి అనుసంధానించే పనులకు నిధుల కేటాయింపునకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయి.   

ఎన్నికల వేళ.. ఘర్షణలు, దాడులు.. పలు గ్రామాల్లో ఉద్రిక్తత

రాష్ట్ర వ్యాప్తంగా తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్  సందర్భంగా కొన్ని  గ్రామాలలలో ఘర్షణ వాతావరణం నెలకొంది.   నారాయణపేట జిల్లా కోస్గి మండల పరిధిలోని సర్జఖాన్‌పేట్‌ లో సర్పంచ్ ఎన్నికల వేళ డబ్బు, మద్యం పంచుతున్నారంటూ ఆరోపణలు గుప్పించుకుంటూ ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. సకాలంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాల వారీని చెదరగొట్టి పోలింగ్ కొనసాగేలా చేశారు. ఈ సందర్భంగా పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జి చేశారు.   ఇక ఖమ్మం జిల్లా కొ కొండవనమాల లో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిన్న అర్ధరాత్రి   వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనతో ఈ ఉదయం పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రాజకీయకక్షతోనే ప్రత్యర్థులు తన ఇల్లు దగ్ధం చేయడానికి ప్రయత్నించారంటూ వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.   సరే ఈ ఘటన కారణంగా పోలింగ్ సమయంలో ఘర్షణలు తలెత్తకుండా గ్రామంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. దీంతో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంద. అదే విధంగా  నల్గొండ జిల్లా  కొర్లపహాడ్‌ గ్రామంలో  పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యక ర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు. పోలీసులు పరిస్థితిని అదుపులోనికి తీసుకువచ్చారు. పోలింగ్ కొనసాగుతోంది. గ్రామంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు.  

తొలి విడత పంచాయతీ పోలింగ్ షురూ!

తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల  పోలింగ్ గురువారం (డిసెంబర్ 11) ఉదయం షురూ అయ్యింది. తొలి విడతలో 3, 834 సర్పంచ్, 27 వేల 628 వార్డు సభ్యల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఇందు కోసం 37 వేల 552 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి విడతలో 56 లక్షల 19 వేల 430 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. ఆయా పంచాయతీలలో విజయం సాధించిన వార్డు సభ్యులు ఉప సర్పంచ్ లను ఎన్నుకుంటారు.  వాస్తవానికి తొలి దశలో మొత్తం 4, 236 సర్పంచ్ పదవులకు ఎన్నిక జ రగాల్సి ఉండగా, ఐదు సర్పంచ్, 169 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. అలాగే 396 పంచాయతీలలో సర్పంచ్ లు, అలాగే 9633 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక పోతే.. ఒక పంచాయతీ సర్పంచ్, 10 వార్డు సభ్యుల ఎన్నికలపై కోర్టు స్టే ఉంది. దీంతో 3, 834 సర్పంచ్, 27 వేల 628 వార్డు సభ్యల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 

సర్పంచ్ ఎన్నికల్లో కొత్త పుంతలు తొక్కుతున్న ప్రచారం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి అత్యాధునిక సాంకేతికతను సృజనాత్మకంగా వినియోగించుకుంటున్న తీరు ఆసక్తి కలిగిస్తోంది. ప్రజలను ఆకట్టుకోవడానికి అభ్యర్థులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు.  మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో ఓ సర్పంచ్ అభ్యర్థి తన ప్రచారం కోసం ఏకంగా  ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ నే రంగంలోకి దింపాశారు. తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్తవంగా అల్లు అర్జున్ ఆ సర్పంచ్ అభ్యర్థికోసం చేయడంలేదు. అలా చేస్తున్నట్లుగా సదరు సర్పంచ్ అభ్యర్థి ఏఐ టెక్నాలజీతో ఓ వీడియో రూపొందించారు. ఆ వీడియోను తన ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.  ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. 

త‌మిళ‌నాట కార్తీక దీపం చిచ్చు! పవన్ ఏమన్నారంటే?

తమిళనాట కొత్త చిచ్చు రేగింది. ఇది మత విశ్వాసాలకు సంబంధించినది కావడంతో ఒకింత ఉద్రిక్త పరిస్థితులు సైతం తలెత్తాయి. ఇంతకీ విషయమేంటంటే.. మ‌ధురైకి ద‌గ్గ‌ర్లో ఉన్న తిరుపుర‌కుండ్రం అనే కుమార స్వామి క్షేత్రంలో కార్తీక దిపానికి సంబంధించినది. త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా  భాసిల్లుతోంది. అయితే ఈ కొండ‌కు ద‌గ్గ‌ర్లో ఒక ద‌ర్గా ఉంటే.. ఆ ద‌ర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై త‌మిళ  కార్తీక దీపం  పెట్ట‌డం అనాదిగా వ‌స్తోన్న ఆచారం. అయితే ఇక్క‌డి ద‌ర్గాకు కుమార‌క్షేత్రానికి చారిత్ర‌క సంబంధాలుండ‌టంతో వివాదం  చెల‌రేగింది. ఈ స్తంభంపై కార్తీక దీపం పెట్ట‌డంపై అభ్యంత‌రాలు వ్య‌క్తం కావ‌డంతో  విషయం కాస్తా  కాస్తా కోర్టు మెట్లు ఎక్కింది.  ఈ విష‌యంలో మ‌ద్రాస్ హైకోర్టు, మ‌ధురై బెంచ్ న్యాయ‌మూర్తి స్వామినాథన్ ఈ దీపం ఇక్క‌డ వెలిగించ‌డానికి అధికారులు త‌గిన‌ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశాలు జారీ  చేశారు. ఈ ఆదేశాల ప్ర‌కారం..  , ఇక్క‌డ కార్తీక దీపం వెలిగించుకోవ‌చ్చు. అయితే ఇలా చేస్తే  మ‌త ఘ‌ర్ష‌ణకు దారి తీసే ప్రమాదం ఉందన్న ఆందోళనతో తమిళనాడు ప్రభుత్వం  దీపం పెట్ట‌నివ్వ‌కుండా,   హైకోర్టును ఆశ్ర‌యించింది. హైకోర్టు  కూడా మ‌ధురై బెంచ్ ఇచ్చిన తీర్పునే స‌మ‌ర్ధించింది. దీంతో దీపం  వ్య‌వ‌హారంలో తిరుపుర‌కుండ్రంలో తీవ్ర ఉద్రిక్త‌త చెల‌రేగింది. ఒక వ‌ర్గం వారు ఇక్క‌డ దీపం  వెలిగించాలంటూ చేపట్టిన ఆందోళన హింసాత్మక రూపం దాల్చి  పోలీసులు సైతం గాయ‌ప‌డ్డారు.   లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. కార్తీక దీపం వెలిగించాలంటూ   తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి జస్టిస్ స్వామినాథ‌న్ పై అభిశంస‌న తీర్మాన‌రం పెట్టాల‌ని నిర్ణ‌యించారు ఇండి  కూట‌మి ఎంపీలు. వీరంతా  క‌ల‌సి ఈ దిశ‌గా ఒక మెమ‌రాండం సైతం స‌మ‌ర్పించారు.  దీనిపై స్పందించిన   ఏపీ డిప్యూటీ  సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌తంలో సుప్రీం  కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి హిందూ దేవ‌త‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తే ఏ పార్టీ ఆయ‌నపై అభిశంస‌న  పెట్ట‌డానికి ముందుకు రాకపోగా  ఆయ‌న్నే వెన‌కేసుకొచ్చార‌న్న పవన్ స్వామినాథ‌న్ ఏం చేశార‌ని  అభిశంస‌న పెట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారో అర్ధం కావ‌డం లేదన్నారు. ఇటువంటి వివాదాలు తలెత్తకుండా స‌నాత‌న బోర్డు ఒక‌టి అత్య‌వ‌స‌రం అంటూ  ట్వీట్   చేశారు.

పంచాయతీ ఎన్నికలు.. అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్!

పంచాయతీ ఎన్నికలలో తొలి విడత ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడడంతో అభ్యర్థుల్లో టెన్షన్ కనిపిస్తోంది. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల్లో  కలవరం మొదలైంది. ప్రచారానికి  వారం రోజులు మాత్రమే గడువు ఇవ్వడంతో గ్రామాల్లో ప్రచారం ముమ్మరం చేశారు. వారికి కేటాయించిన గుర్తులతో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సారి గ్రాయపంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా జరగనున్నాయి. ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం (డిసెంబర్ 9)  సాయంత్రంతో ముగియనుంది.  అదలా ఉండగా.. రెండో విడత ఎన్నికలకు సంబంధించిన  ప్రచారం మరింత జోరందుకుంది. ఈ నెల 14న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. మరో పక్క మూడో విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం కూడా పూర్తయ్యింది. దీనికి సంబంధించి ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది. అంతే కాకుండా ఈ నెల 17న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి.