పనిష్మెంట్ ఐపీఎస్‌ల డుమ్మా!
posted on Aug 28, 2024 @ 5:06PM
జగన్ రాక్షస పాలనలో వైసీపీ దండుపాళ్యం బ్యాచ్ ఆడమన్నట్టల్లా ఆడి, చేయమన్న గలీజు పనులల్లా చేసిన పలువురు ఐపీఎస్ ఆఫీసర్లు కూటమి ప్రభుత్వంలో ఏ విధులూ లేకుండా ఖాళీగా కూర్చునే పనిష్మెంట్ అనుభవిస్తున్నారు. ఆ పనిష్మెంట్‌లో భాగంగా వీరు ప్రతిరోజూ డీజీపీ ఆఫీసుకు వచ్చి సంతకాలు చేయాల్సి వుంది. అయితే మొత్తం 16 మందిలో నలుగురైదుగురు ఆఫీసుకు రావడం లేదు. ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, సీఐడీ విభాగం మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ కొద్దిరోజులపాటు సెలవులో వున్నారు. ఆ తర్వాత నుంచి సంతకం చేయడానికి రావడం లేదు. అలాగే సోషల్ మీడియాలో తనను తాను ప్రమోట్ చేసుకున్న విశాల్ గున్ని, ఎస్పీలు కేకేఎస్ అన్బురాజ్, తిరుమలేశ్వర్ రెడ్డి కూడా ఆఫీసుకు రాకుండా డుమ్మా కొడుతున్నారు. వీళ్ళే కాకుండా సిద్ధార్థ కౌశల్, మేరీ ప్రశాంతి, జీఆర్ రాధిక కూడా డుమ్మా బ్యాచ్‌లో వున్నారు. డీజీపీ ప్రతిరోజూ ఆఫీసుకు వచ్చి సంతకాలు చేయాలని ఆదేశించినా పట్టించుకోకుండా ధిక్కరించడం వెనుక వీరికి వున్న ధైర్యమేంటో అర్థం కాకుండా వుంది.