రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం
posted on Mar 6, 2013 @ 9:48AM
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు నేడు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటలవరకు జరుతాయి. ఇంటర్మీడియట్ పరీక్షలకు 19,96,967 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 9,86,052 పరీక్షకు హాజరవుతుండగా రెండవ సంవత్సరం 10,10,915 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. నేడు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సెకెండ్ లాంగ్వేజ్ పరీక్షతో ప్రారంభమైంది. ప్రభుత్వం మొత్తం 1633 పరీక్షాకేంద్రాలుగా ఏర్పాటు చేసింది.