ఏసీసీ టీ-20 కి హర్మన్‌ప్రీత్ జట్టు
posted on Sep 21, 2022 @ 1:52PM
ఏసీసీ టీ-20 ఛాంపియన్‌షిప్‌కి హర్మన్ ప్రీత్ నాయకత్వంలో భారత్ మహిళల జట్టు ఎంపిక చేశారు. బెంగుళూరులో ఈ టోర్నీ అక్టోబర్ 1 నుంచి 15 వరకూ జరుగుతుంది. ఇటీవలి ఇం గ్లండ్ సిరీస్లో పాల్గొన్న జట్టులో ఉన్నవారే తిరిగి ఎంపికయ్యారు. స్టాండ్‌బైలుగా తానియా భాటి యా, సిమ్రన్ బహదూర్ ఎంపికయ్యారు.
ఆరుపర్యాయాలు ఛాంపియన్‌గా నిలిచిన భారత్ ఈ ఛాంపియన్‌షిప్‌లో మొదటి మ్యాచ్ శ్రీలంకతో తలపడుతుంది. అక్టోబర్ 7న పాకిస్తాన్‌తో తలపడు తుందని ఆలిండియా మహిళల క్రికెట్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. బెంగుళూరులో జరిగే ఛాంపి యన్‌షిప్‌లో మొత్తం ఏడు జట్లు పాల్గొంటాయి. వీటిలో బంగ్లా దేశ్, పాకిస్తాన్, శ్రీలంక, థాయ్‌లాండ్, మలేషియా, యుఏఇ జట్లు ఉన్నాయి.
హర్మన్‌ప్రీత్ నాయకత్వంలోని భారత్ జట్టులో స్మ్రితీ మంధాన(వైస్‌కెప్టెన్), దీప్తిశర్మ, షఫాలీవర్మ, రోడ్రిగ్స్, మేఘన, రిచాఘోష్ (వికెట్‌కీపర్), స్నేహారాణా, హేమలత, మేఘ్నాసింగ్, రేణుకాథాకూర్, పూజా, రాజేశ్వరి గైక్వాడ్, రాధాయాదవ్, కె.పి.నావగిరె ఉన్నారు.