100 కోట్ల ఓటర్ల మార్క్ కు చేరువలో ఇండియా
posted on Jan 23, 2025 @ 11:35AM
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలిచింది. మోస్ట్ పాప్యులేటెడ్ కంట్రీగా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ జనాభా విషయంలో భారత్ దేశాన్ని దాటేసింది. ఇక చైనాలో ఏటికేడు జనాభా తగ్గుతోంది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది. దానితో సరిపెట్టుకోకుడా ఇప్పుడు మరో రికార్డుకు కూడా చేరువైంది.
ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న దేశంగా ఇప్పటికే భారత్ నిలిచింది. ఇక ఇప్పుడు దేశంలో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరింది. ఈ సంఖ్య త్వరలోనే వంద కోట్లకు దాటుతుందన్న అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే దేశంలోనే బిలియన్ అంటే కోటి మంది ఓటర్లు ఉన్న ఏకైక దేశంగా భారత్ నిలుస్తుంది. శనివారం (జనవరి 25) జాతీయ ఓటరు దినోత్సవం నేపథ్యంలో ఎన్నికల సంఘం దేశంలో ఓటర్ల వివరాలు వెల్లడించింది.
గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల నాటికి దేశంలో నమోదైన ఓటర్ల సంఖ్య 96.88 కోట్లు.. అయితే ఈ ఏడాది ఆ సంఖ్య భారీగా పెరిగింది. మొత్తం 99.1 మంది ఇప్పటి వరకూ ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వీరిలో యువ ఓటర్ల సంఖ్య 27.1 కోట్లు.. 2024తో పోలిస్తే ఇది ఎక్కువ. ఇక జెండర్ తేడా కూడా చాలా వరకూ తగ్గిపోయింది. గత ఏడాది ఓటర్ల జాబితా మేరకు ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 948 మంది మహిళలుండగా ఈ ఏడాది అది 954కు పెరిగింది.