మరోసారి బయటపడ్డ బిజెపి బిఆర్ఎస్ మధ్య అక్రమ సబంధం
posted on Aug 21, 2024 @ 12:18PM
అదేదో అన్నట్టు తాను చేస్తే శృంగారం ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నట్టు తయారయ్యింది బిఆర్ఎస్ వైఖరి. పదేళ్లు అరాచక పాలన సాగించిన బిఆర్ఎస్ కుటుంబం కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలో రావడాన్ని బిఆర్ఎస్ ఓర్వలేకపోతోంది. ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు బినామీలకు వేల కోట్ల రూపాయలు కట్టబెట్టిన కెటీఆర్ దొంగనే దొంగ దొంగ అంటూ అరచినట్లు ఉంది.
బిజెపిలో బిఆర్ఎస్ విలీనం అని వార్తలు ప్రసారం చేసిన మీడియా సంస్థపై కోర్టులో కేసువేసింది. తాను పతివ్రతను అన్నట్టు ప్రదర్శించే బ ప్రయత్నాలు బిఆర్ఎస్ చేస్తోందని నెటిజన్లు అంటున్నారు. చాణక్య రాజనీతి శాస్త్రం ప్రకారం శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్టు కాంగ్రెస్ ను నిలువరించడానికి బిజెపి బిఆర్ఎస్ ఒక్కటయ్యాయి. ఇండియా కూటమిలో కూడా లేని బిఆర్ఎస్ ఎన్డియే కూటమికి మద్దత్తు తెలుపుతుంది. తీహార్ జైల్లో ఉన్న కవితను విడిపించడానికి బిఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీకావు. ఒకసారి పొత్తు, మరోసారి విలీన లీకులు ఇచ్చేది కూడా బిఆర్ఎస్ శ్రేణులే. గత ఎన్నికల ముందు చెట్టపట్టాల్ వేసుకుని తిరిగిన రెండు పార్టీలు ఫలితాల తర్వాత గ్యాప్ మెయిన్ టైన్ చేస్తున్నాయి. బిఆర్ఎస్ కాళ్ల బేరంతో బిజెపి ప్రభుత్వాన్ని మచ్చిక చేసుకోవాలని చూస్తోంది. కవితను విడిపించడమే టార్గెట్ గా బిఆర్ఎస్ పావులు కదుపుతోంది. రేవంత్ రెడ్డి అమెరికా నుంచి వచ్చిన తర్వాత బిఆర్ఎస్ బిజెపికి మరింత దగ్గరైంది. కాగితం మీద రాసిచ్చిన ఫిర్యాదు ప్రకారం ఈడీ కేసు నమోదు చేసింది. ఈడీకి దేశ వ్యాప్తంగా అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ కేసులు నమోదు చేయని బిజెపి ప్రభుత్వం బిఆర్ఎస్ చేసిన ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు ప్రారంభించింది. తన అక్రమ సంబంధంతో బిజెపి రంకు మొగుడు అని బిఆర్ఎస్ మరోమారు నిరూపించుకుంది.
అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం స్వచ్ఛ బయో సంస్థతో రూ.1000 కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ డీల్ వెనుక పరస్పర ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్... ఈడీకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడిపై ప్రతిపక్ష పార్టీ ఆరోపణలను గుప్పించింది. స్వచ్ఛ బయో, ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందంపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
బీఆర్ఎస్ ప్రకారం... ప్రతిపక్షం ఇచ్చిన ఫిర్యాదును ఈడీ స్వీకరించి, రసీదు ఇచ్చింది. స్వచ్ఛ బయో డైరెక్టర్లలో ఒకరు స్వయానా సీఎం సోదరుడు అనుముల జగదీశ్వర్ రెడ్డి ఉన్నారని, ఇది క్విడ్ ప్రోకో అని బీఆర్ఎస్ ఆరోపించింది. స్వచ్ఛ బయో డైరెక్టర్లలో ఒకరు అనుముల జగదీశ్వర్ రడ్డి కావడం ఆందోళన కలిగించే అంశమని, ఇది ఈ ఎంవోయూ చిత్తశుద్ధిని ప్రశ్నించే విధంగా ఉందని ఈడీకి రాసిన లేఖలో పేర్కొంది.
అమెరికాలోని ఫిలడెల్పియాలో సీఎం అధికారిక పర్యటనకు కేవలం 15 రోజుల ముందు స్వచ్ఛ బయోను తెరపైకి తీసుకు వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రిజిస్టర్ అయిన ఈ కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి క్రియాశీల వ్యాపార కార్యకలాపాలు నిర్వహించలేదని, ఇది షెల్ కంపెనీ అని ఆరోపించింది.
ఈ కంపెనీని అమెరికాలోనే ఎందుకు ప్రకటించారు? ప్రయోజనం ఏమిటి? ఈ కంపెనీలో విదేశీ నిధులు ఉన్నాయా? మనీ లాండరింగ్ ఉందా? అనే అంశాలు తెలియాల్సి ఉందని పేర్కొంది. ఎంవోయూపై సంతకం చేసే సమయంలో రేవంత్ రెడ్డి పక్కన హర్ష పసునూరి ఉండటంపై కూడా తన ఫిర్యాదులో బీఆర్ఎస్ అనుమానం వ్యక్తం చేసింది.
ఎంవోయూపై సంతకాలు చేసిన సమయంలో సీఎం పక్కన ఉన్న వ్యక్తి పసునూరి హర్ష అని వెల్లడించింది. హర్ష పసునూరి, సీఎం సోదరుడు తమ ఆర్థిక పరిస్థితిని వివరించాలని, రూ.1000 కోట్ల పెట్టుబడులు ఎలా పెడతారో చెప్పాలని డిమాండ్ చేసింది. విషయమై అధికారులు సమగ్ర విచారణ జరపాలని కోరింది.ఇది పూర్తి అవినీతిమయమైన ఎంవోయూ అని, కాబట్టి అధికారులు తమ ఫిర్యాదును స్వీకరించి స్వచ్ఛ బయో డైరెక్టర్లతో పాటు రేవంత్ రెడ్డిపై న్యాయ విచారణ జరపాలని కోరింది.