ఆ సిక్సర్ ఆల్ టైమ్ గ్రేట్.. కొట్టిందెవరో తెలుసా?
posted on Nov 16, 2022 6:18AM
టీ20 ప్రపంచకప్ లో ఆల్ టైమ్ గ్రేటెస్ట్ టీ20 షాట్ ఎవరు కొట్టారో తెలుసా? అసలు టీ20లో ఆల్ టైమ్ గ్రెటెస్ట్ షాట్ ఏమిటి? అది ఎవరు కొట్టారు? అన్న విషయాన్ని ఐసీసీ వెల్లడించింది. ఇప్పటి వరకూ ఎందరో ప్లేయర్లు టి20లలో సత్తా చాటారు. బంతి బంతికీ విజయం సమీకరణాలు మార్చేసే అద్భుత ఫార్మాట్ లో అత్యద్భుత షాట్లతో తమ జట్లకు విజయాలను అందించిన క్రీడాకారులు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా టి20లంటే చెలరేగి ఆడే క్రిస్ గెయిల్, డివిలియర్స్, తాజాగా సూర్యకుమార్ యాదవ్ ఇలా ఎందరో ఉన్నారు.
నాన్ క్రికెటింగ్ షాట్లతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడంలో దిట్టలుగా పేరొందిన వారెంత మందో ఉన్నారు. అంతెందుకు క్రికెట్ లో టి20 ఫార్మాట్ వచ్చిన తరువాత ఆ ఫార్మట్ కోసమే స్పెషలిస్ట్ బ్యాట్స్ మన్ లు తయారయ్యారు. అయితే వారెవరికీ సాధ్యం కానిది మన కింగ్ కోహ్లీ చేసి చుపించాడు. ఇప్పటికే ఫార్మట్లతో సంబంధం లేకుండా తనను తాను ప్రూవ్ చేసుకున్న కింగ్ కోహ్లీ క్రికెట్ ప్రపంచం మొత్తం ఇప్పటివరకూ క్రికెట్ చరిత్రలో . ఎవ్వరూ కొట్టనిచ కొట్టలేని అద్భుత షాట్ ఆడాడు.
క్రికెట్ హిస్టరీలోనే అదో రికార్డ్. పాకిస్తాన్ తో జరిగిన తొలి మ్యాచ్ లో రికార్డ్ ఛేదన చేసిన విరాట్ కోహ్లీ ఫైనల్ ఓవర్లలో పాక్ బౌలర్ అసద్ రౌవూఫ్ బౌలింగ్ లో కొట్టిన రెండు సిక్సులలో ఒక సిక్స్ అద్భుతమని అప్పుడే అందరూ పొగిడారు. ఇప్పుడు ఐసీసీ కూడా దానికి గుర్తింపునిచ్చింది. గౌరవించింది. టి20లలో అదే అద్భుత సిక్సర్ అని ప్రకటించింది. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచకప్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారుడిగా నిలిచిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఐసీసీ విడుదల చేసిన బెస్ట్ షాట్ కేటగిరిలో కింగ్ విరాట్ కోహ్లీ పాకిస్తాన్ తో జరిగిన తొలి మ్యాచ్ లో హరీస్ రవూఫ్ బౌలింగ్ లో బౌన్సర్ బాల్ ను బౌలర్ తలమీదుగా సిక్సర్ గా మలిచిన షాట్ ను ‘ఆల్ టైమ్ గ్రేటెస్ట్ టీ20 షాట్ గా’ పేర్కొంది. ఇలాంటి షాట్ ఏ క్రీడాకారుడు కొట్టలేదని.. పేర్కొంది. ఆ ఘనత కోహ్లీదేనని ప్రకటించింది.