Read more!

మెట్రో అధికారులు సామాన్యులనీ కరుణించాలి!

గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో వున్న రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ అర్ధరాత్రి వరకు కొనసాగనుంది. క్రికెట్ ప్రేమికుల సౌకర్యాన్ని దృష్టిలో వుంచుకుని గురువారం రాత్రి ఒంటిగంట వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో వుంటాయని మెట్రో అధికారులు ప్రకటించారు. సాధారణంగా రాత్రి పదిన్నర తర్వాత మెట్రోలు అందుబాటులో వుండవు. క్రికెట్ మ్యాచ్ కారణంగా రాత్రి 12:15కి ఎల్.బి.నగర్లో చివరి మెట్రో ప్రారంభమై, గమ్యస్థానమైన మియాపూర్‌కి 1:10 గంటలకు చేరుకుంటుదని ప్రకటించారు. ఉప్పల్, ఎన్జీఆర్ఐ స్టేషన్లలో మెట్రో ఎక్కడానికి మాత్రమే అనుమతి వుంటుందని, మిగతా స్టేషన్లలో దిగడానికి అనుమతి వుంటుందని మెట్రో అధికారులు తెలిపారు.

అంతా బాగానే వుందిగానీ, క్రికెట్ ప్రేమికుల కోసం లేట్ నైట్ మెట్రో నడుపుతున్న అధికారులు ప్రతిరోజూ సామాన్య ప్రజల కోసం కూడా లేట్ నైట్ మెట్రో నడపితే బాగుంటుంది కదా అనే అభిప్రాయాలు వ్యక్తవుతున్నాయి. నిజానికి హైదరాబాద్ నిద్రపోని నగరాల జాబితాలోకి మెల్లగా ప్రవేశిస్తోంది. రాత్రి పదిన్నరకే మెట్రోని ఆపేయడం వల్ల చాలామంది  ఇబ్బంది పడుతున్నారు. రాత్రి పన్నెండు గంటల వరకు మెట్రో వుంటే చాలా సౌకర్యవంతంగా వుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ అంశం మీద మెట్రోకి విజ్ఞాపలను అందాయి. కానీ ఫలితమే రాలేదు. అందువల్ల క్రికెట్ లవర్స్ మీద కురిపించిన అభిమానాన్ని సాధారణ ప్రయాణికుల మీద కూడా చూపించండి అని పలువురు మెట్రో అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.