పెళ్లి పేరుతో.. పెద్ద మోసమే..
posted on May 1, 2021 @ 3:52PM
అది హైద్రాబాద్ బేగంపేట్. ఆ ప్రాంతానికి చెందిన ఓ యువతి. ఆమె సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. పెళ్లి సంబంధం కోసం మ్యాట్రిమోనీ సైట్‌లో ప్రొఫైల్ అప్‌లోడ్ చేసింది. ఆమె ప్రొఫైల్ చూశాడు మొహల్‌కుమార్ . ఆ తర్వాత ఫోన్ చేశాడు. నెక్స్ట్ ఇద్దరు పరిచయం చేసుకున్నారు. అతను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరు మనసులు కలిశాయి. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కొంతకాలం గడిచింది.
కట్ చేస్తే.. గుజరాత్ లో ఉన్న తన ఇంటి రిపేర్ కోసం డబ్బులు అసరమున్నాయని.. మేస్త్రి ఖాతాలో కొన్నీ డబ్బులు జామా చేయమన్నాడు. అందుకు ఆమె కూడా ఇళ్లు మా కోసమే కదా అనుకుంది. అతడు చెప్పిన ఖాతాలో డబ్బులు పంపించింది. పెళ్లి అయ్యాక తనను అమెరికా తీసుకెళ్తాను అని. అందుకు కావాల్సిన ప్రాసెస్ అక్కడి అక్కడి నుండే స్టార్ట్ చేస్తాను అన్నాడు. నాకు కాబోయే వాడు చాలా మంది వాడు అనుకుంది. వీసా కు సంబందించిన ఓ నెంబర్ ఇచ్చి వారిని సంప్రదించాలని అన్నాడు. మళ్ళీ ఆ యువతి తను చెప్పినట్టలా గంగిరెద్దులా తలాడించింది. వీసా ప్రాసెస్ కోసం వారు అడిగిన 4 లక్షల రూపాయలు వారు చెప్పిన ఖాతాలోకి ట్రాన్సఫర్ చేసింది.
ఇక, ఇది జరిగిన వారానికి తాను ఇండియా వస్తున్నట్టు సైబర్ నేరగాడు యువతికి చెప్పాడు. నేరుగా హైదరాబాద్‌కే వస్తున్నట్టు నమ్మించాడు. ఇక, ఎయిర్‌పోర్ట్ నుంచి ఆమెకు ఫోన్ చేసి.. కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని, తన వద్ద 50 వేల డాలర్లు ఉన్నందున.. జరిమానా చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నట్టుగా చెప్పారు. ఇలా చెప్పి ఆ యువతి దగ్గర నుంచి రూ. 6 లక్షలు దోచేశాడు. ఆ తర్వాత కూడా డబ్బులు అడగటంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమెను మాయ మాటలతో బురిడీ కొట్టించాడు మొత్తం 10 లక్షల టోకరా వేశాడు. ఆ సైబర్ నేరగాడు మీరు గూడా జెర్ర జాగ్రత్త మరి అమెరికా సంబంధాన్ని అని చెప్పగానే ఆగం ఆగం కాకండి. ఆలోచించండి.