హైదరాబాద్ పేలుళ్ళు: నేపాల్ లో ఇద్దరు అరెస్ట్
posted on Feb 24, 2013 @ 10:44AM
హైదరాబాద్ పేలుళ్ళ కేసులో అనుమానితులుగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులున్ని భారత్, నేపాల్ సరిహద్దు ప్రాంతంలో భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరిని హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ ఆదాంగా, రెండో వ్యక్తిని సోమాలియాకు చెందిన మహ్మద్ అబ్దుల్లా ఓమన్‌గా గుర్తించారు. బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లా రక్సాల్ వద్ద సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.అనంతరం వీరిని బీహార్ తూర్పు చంపరాన్ పోలీసులకు అప్పగించారు.
ఇద్దరి నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చెందిన కొన్ని ఫొటోలు, దృశ్యాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సికింద్రాబాద్‌కు చెందిన ఫోటోలు, దృశ్యాలు దొరకటంతో హైదరాబాద్ బాంబు పేలుళ్లతో వీరికేమైనా సంబంధం ఉందా అన్న విషయమై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.