అగ్ని ప్రమాద ఘటనలో అమాయక ప్రజలు చనిపోవడం బాధాకరం : సీఎం చంద్రబాబు
posted on May 18, 2025 @ 12:43PM
హైదరాబాద్ గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమాయక ప్రజలు చనిపోవడం బాధాకరమని ముఖ్యమంత్రి ఎక్స్ ద్వారా తెలిపారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాద ఘటన తీవ్రంగా కలిచివేసిందని మంత్రి లోకేశ్ అన్నారు. పాత బస్తీ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో పలువురి మృతి కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం అందిస్తామన్నారు