భారత సైన్యం విజయం కోసం హోమాలు.. గోమాతలకు శ్రీమంతం వేడుక
posted on May 9, 2025 @ 4:14PM
పాకిస్థాన్ తో యుద్ధంలో భారత్ విజయాన్ని కాంక్షిస్తూ మంగళగిరి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్డపూడి గ్రామంలోని భగవాన్ శ్రీ సత్య షిరిడి సాయిబాబా మందిరం గోశాలలో హోమాలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ చార్జ్, మాజీ జడ్పీ చైర్మర్ పాతూరి నాగభూషణం ఆధ్వర్యంలో ఈ హోమాలు జరిగాయి. అలాగే గోశాలలో గోవులకు సీమంతం వేడుక, గోపారాయణం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాశన, గోమాతకి పంచామృతాభిషేకం, శాంతి హోమం, మహా పూర్ణాహుతి నిర్వహించారు. మూడు గోమాతలకు సీమంతం, దంపతీ పూజ నిర్వహించారు. గోశాల కన్వీనర్ పాతూరి శ్రీనివాసరావు, శ్రీమతి రాధిక దంపతులు ఈ పూజలు జరిపారు. మందిరం చైర్మన్ పాతూరి నాగభూషణం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్లో మన యాత్రికులపై దాడి చేసి పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులపై భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రతిచర్య ద్వారా ఉగ్రవాదులకు బుద్ధి చెబితే, తిరిగి పాకిస్తాన్ మ పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లలో దాడులకు పాల్పడుతున్నదనీ, భారత సైన్యానికి కులమతాలు, పార్టీలకు అతీతంగా ప్రజలందరూ మద్దతుగా ఉండాలనీ పాతూరి నాగభూషణం ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఈ ధర్మ యుద్ధంలో భారత సైన్యం విజయం సాధించాలనీ ఆకాంక్షిస్తూ గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.