యువతిని వీడియో తీసిన డ్రైవర్
posted on Jan 20, 2015 @ 11:06PM
అప్పుడెప్పుడో ఉండేవారని చెప్పుకునే రాక్షస జాతి ఇప్పుడు కొంతమంది క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్ల రూపంలో ఇప్పటి సమాజంలో తిరుగుతోందా అనే సందేహాలు కలుగున్నాయి. ఇటీవలి కాలంలో క్యాబ్, ఆటో డ్రైవర్లు దేశవ్యాప్తంగా మహిళల మీద అఘాయిత్యాలకు పాల్పడటం, అవమానించడం లాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. మొన్నీమధ్యే జూబిలీహిల్స్‌లో నలుగురు ఆటో డ్రైవర్లు ఒక మైనర్ బాలికను మానభంగం చేశారు. ఇదిలా వుంటే, మంగళవారం నాడు హైటెక్ సిటీ ప్రాంతంలో ఒక ఉద్యోగిని క్యాబ్ ఎక్కింది. ఆ సమయంలో క్యాబ్‌లో ఆమె ఒక్కతే వుంది. కాస్త అలసటగా వుండటంతో ఆమె క్యాబ్‌లో నిద్రపోయింది. అయితే ఆ క్యాబ్‌ని డ్రైవ్ చేస్తున్న రషీద్ అనే డ్రైవర్ నిద్రపోతున్న ఆ యువతిని సెల్‌ఫోన్‌తో వీడియో తీశాడు. దాదాపు ఎనిమిది నిమిషాలపాటు ఆమెను వీడియో తీశాడు. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన పోలీసు ‘షీ’ టీమ్‌లు ఈ డ్రైవర్ పద్ధతి అనుమానంగా అనిపించి, క్యాబ్ ఆపి చెక్ చేస్తే అతను చేసిన నిర్వాకం బయటపడింది. ప్రస్తుతం సదరు డ్రైవర్ కటకటాల వెనుక వున్నాడు.