బిగ్ బాస్ షో లో అశ్లీలత... హైకోర్టు ఆగ్రహం
posted on Sep 30, 2022 @ 2:40PM
ఒక టీవీ ఛానల్‌లో వస్తున్న బిగ్ బాస్ షో యువతను ఎంతో ఆకట్టుకుంటోంది. అయితే ఇప్పటికి ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో మీద అసలు ఆరంభం నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ షో అశ్లీలతతో కూడిందని, దీన్ని వెంటనే నిషేధించా లంటూ చాలామంది విమర్శలు చేసారు. కానీ ఐదు ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఆరో ఎపిసోడ్ మరింత దారుణంగా ఉందని చాలా అశ్లీలత చోటు చేసుకుం టోందని షోనీ నిలిపి వేయాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలయింది. దీనిపై విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది శివప్రసాద్ రెడ్డి ఐబీఎఫ్ మార్గదర్శకాలు అస్సలు పాటించడం లేదని, నిర్లక్ష్యం చేశారని వివరించారు. ఈ విషయమై హైకోర్టు కూడా ఆగ్రహించింది. ఈ సందర్భంగా 1970 లలో సినిమాల విష యాన్ని హైకోర్టు ప్రస్తావించింది. కేంద్రం తరఫు న్యాయవాది దీనిపై స్పందించేం దుకు సమయం కోరారు. ప్రతివాదులకు నోటీసుల విష యాన్ని తదుపరి వాయిదాలో నిర్ణయిస్తామని న్యాయస్థానం తెలిపింది. విచారణను అక్టోబరు 11కు న్యాయస్ధానం వాయిదా వేసింది.
బిగ్ బాస్ షో పై స్పందించడానికి కేంద్రం సమయం కావాలని కోరింది. ప్రతివాదులకు నోటీసులపై తదు పరి వాయిదాల్లో నిర్ణయిస్తామని హైకోర్టు తెలిపింది. ఈ పిటిషన్ పై విచారణను ఈ ఏడాది అక్టోబర్ 11వ తేదీకి వాయిదా వేసిందని ఒక తెలుగు న్యూస్ చానెల్ కథనం ప్రసారం చేసింది.
బిగ్బాస్ షో పై 2019లోనే కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ రియాలిటీ షోలో అశ్లీలత, అసభ్యత, హింస ఎక్కువైందని ఆయన ఆరోపించారు. ఈ పిటిషన్ పై అత్యవసరంగా విచా రణ జరిపిం చాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో ఈ పిటిషన్ పై విచారణ ను ప్రారంభిం చింది ఏపీ హైకోర్టు. ఇవాళ కూడ ఈ విషయమై హైకోర్టు విచారణ నిర్వహించింది.
బిగ్ బాస్ షో లో చోటు చేసుకుం టున పరిణామాలపై సీపీఐ జాతీయకార్యదర్శి నారాయణ తనదైన శైలి లో విమర్శలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చొని చూసేలా ఈ కార్యక్రమం లేదని నారా యణ విమర్శించారు. ఈ షో ను బ్యాన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ షోకి వ్యాఖ్యతగా వ్యవహ రిస్తున్న నటుడు నాగార్జునపై కూడ నారాయణ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
గతంలో బిగ్ బాస్ షో ప్రసారమైన సమయంలో కూడా నారాయణ ఈ షోపై విమర్శలు చేశారు. ప్రసార మంత్రిత్వశాఖ ఈ విషయమై ఏం చేస్తుందని కూడా నారాయణ ప్రశ్నించారు. దేశంలోని పలు భాషల్లో ఈ రియాల్టీ షో ప్రసారమౌతుంది. తెలుగులో ఆరో సీజన్ ప్రస్తుతం ప్రసారం అవుతుంది.