వెల్‌డన్ పోలీస్.. లాక్‌డౌన్ చర్యలపై హైకోర్టు ప్రశంసలు..
posted on May 17, 2021 @ 12:15PM
3.39 లక్షల కేసులు. 31 కోట్ల జరిమానా. ఇదీ తెలంగాణలో లాక్‌డౌన్ సందర్భంగా పోలీసుల పనితీరు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. డీజీపీతో పాటు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు విచారణకు హాజరయ్యారు. లాక్‌డౌన్‌తో పాటు కరోనా నిబంధనల అమలుపై కోర్టుకు నివేదికను సమర్పించారు.
మాస్కులు లేని వారిపై 3,39,412 కేసులు నమోదు చేశారు పోలీసులు. మందుల బ్లాక్ మార్కెటింగ్‌పై 98 కేసులు పెట్టారు. భౌతికదూరం పాటించనందుకు 22,560 కేసులు ఫైల్ చేశారు. మొత్తం 31 కోట్ల జరిమానా వసూలయ్యాయి అంటూ పోలీసులు హైకోర్టుకు నివేదించారు. లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూ పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ కోర్టుకు తెలిపారు.
పోలీసుల పనితీరును హైకోర్టు ప్రశంసించింది. ఇదే స్పూర్తితో పని చేయాలని సూచించింది. డీజీపీతో పాటు ముగ్గురు కమిషనర్లను అభినందించింది హైకోర్టు.
లాక్‌డౌన్ సందర్భంగా తెలంగాణ పోలీసులు నిర్విరామంగా పని చేస్తున్నారు. 24 గంటల పాటు నాన్‌స్టాప్‌గా లాక్‌డౌన్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య.. లాక్‌డౌన్‌కు సడలింపు ఉండటంతో.. ఆ సమయంలో ప్రజలు ఒకేచోట గుమ్మి కూడి ఉండకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైనా మాస్కు పెట్టుకోకపోయినా.. గుంపులుగా కనిపించినా.. అక్కడికక్కడే ఫైన్‌లు విధిస్తున్నారు. ఇక ఉదయం 10 గంటల తర్వాత అసలు పని మొదలవుతుంది. సరైన కారణం లేకుండా ఎవరైనా బయటకి వస్తే పోలీసులు పట్టేసుకుంటున్నారు. వివరాలు ఆరా తీసి.. అనవసరంగా రోడ్డు మీదకు వచ్చారని భావిస్తే.. జరిమానా విధించి వసూలు చేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తోనే కాస్త కఠినంగా వ్యవహరిస్తూ.. లాక్‌డౌన్‌ను పర్‌ఫెక్ట్‌గా అమలు చేస్తున్నారు. అందుకు నిదర్శనమే.. 3.39 లక్షల కేసులు.. 31 కోట్ల జరిమానాలు. అందుకే, హైకోర్టు పోలీసుల పనితీరును మెచ్చి వారిని అభినందించింది.